రాష్ట్ర విభజనపై వెంకయ్య సంచలన వ్యాఖ్యలు venkaiah naidu sensational comments on state bifurcation

Venkaiah naidu sensational comments on state bifurcation

venkaiah naidu, union minister venkaiah naidu, venkaiah naidu sensational comments, venkaiah on state bifurcation, venkaian naidu Kvp ramachandra rao, KVP ramachandra rao, state bifurcation

union minister venkaiah naidu sensational comments on state bifurcation, says except Kvp ramachandra rao all leaders were in favour of state bifurcation

రాష్ట్ర విభజనపై వెంకయ్య సంచలన వ్యాఖ్యలు

Posted: 09/11/2016 08:58 AM IST
Venkaiah naidu sensational comments on state bifurcation

రాష్ట్ర విభజనపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు, అన్ని పార్టీల నేతలు రాష్ట్రం విడిపోవాలని ఏదోవిధింగా కోరకున్నవారేనని, అయితే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మాత్రమే రాష్ట్రం విడిపోకుండా ఉండాలని గట్టిగా ప్రయత్నించారని అన్నారు. విభజన చట్టంలోనే ప్రత్యేక హోదాను ఇవ్వాలని ఒక్క మాట పెట్టుంటే, ఇప్పుడీ రభస, రాద్ధాంతాలకు అవకాశం ఉండేది కాదని, నాటి కాంగ్రెస్ తప్పిదమే ఇవాళ పెను సమస్యగా మారిందని అన్నారు. ఒక్క కేవీపీ మాత్రమే, తాను విభజనకు వ్యతిరేకమని మొదటి నుంచి వాదిస్తూ వచ్చారని, మిగతా ఎంపీలంతా ఏదో ఒక దశలో రాష్ట్రం రెండు ముక్కలైతేనే మంచిదని వ్యాఖ్యానించిన వారేనని వెంకయ్య అన్నారు.

విడిపోతే నీటి విషయంలో పెను తగాదాలు వస్తాయని తాను ముందే ఊహించి, వివాదాలకు ఆస్కారం లేకుండా పాత ఒప్పందాలను గౌరవించాలన్న పదాన్ని చట్టంలో చేర్పించానని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీల మధ్య సమన్వయం తెచ్చి, లాభ నష్టాలను అంచనా వేయడం అంత సులువేమీ కాదని అయినా.. దీనికోసం తన వంతు కృషి చేస్తున్నానని.. ప్రత్యేక హోదా విషయంలో తనపై విమర్శలు గుప్పింస్తున్న ఆరాట పోరాట యోధులు రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఎక్కడున్నారో చెబితే చాలా బాగుంటుందని.. తనను తప్పుబట్టే వాళ్లందరూ అప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేశారో ఒకసారి చెప్పాలని  వెంకయ్య విమర్శలకుల నోళ్లకు తాళాలు వేసే ప్రయత్నం చేశారు.

బీజేపీ మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోవాలనే చెప్పిందని, హైదరాబాద్ తెలంగాణకు దక్కాలని, ఏపీకి న్యాయం జరగాలన్నదే తమ అభిమతమని వెంకయ్య తెలిపారు. పార్టీ విధానానికి తగ్గట్టుగానే తాము నడిచామని గుర్తు చేశారు. అది రాజకీయ వ్యూహమేనని, అవకాశవాద రాజకీయం అనడం తప్పని హితవు పలికారు. అందులో రాజకీయ అవసరాలు లేవని, దాని గురించి తెలియని వాళ్లే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkaiah naidu  kvp ramachander rao  state bifurfication  sensational comments  

Other Articles