వైవాహిక జీవితంలో ఒకరినోకరు టార్చర్ లు పెట్టుకోవటం ఇప్పుడున్న జనరేషన్ కి బాగా అలవాటు అయిన పనే. ఈపాటిదానికే ఇక్కడో వ్యక్తి తన భార్యను ఏకంగా ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టేశాడు. అయితే, తనను అమ్మకానికి పెట్టాడని తెలుసుకున్న లియాండ్రా అతనిని చంపేస్తానని పేర్కొంది. ఇంతకీ ఈ వేలాన్ని సరదా కోసం పెట్టాడా? లేక సీరియస్సా? అనేది తెలియటం లేదు. అది పక్కనబెట్టి వివరాళ్లోకి వెళ్లితే....
బ్రిటన్ లోని వోక్ ఫీల్డ్ లోని యార్క్ షైర్ కు చెందిన రాచెల్ సింప్రస్ ఈకామర్స్ వెబ్ సైట్ ఈబే ఓపెన్ చేసి చూస్తుండగా ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే అందులో తన బెస్ట్ ఫ్రెండ్ ప్రాంక్ భార్య లియాండ్రా ఫోటో పెట్టి అమ్మకానికి పెట్టారు. తన భార్యను ఎందుకు విక్రయించాలనుకుంటున్నదీ ప్రాంక్ స్టార్ జోకెర్ సిమన్ ఓకనె (33) అనే వ్యక్తి పూర్తి వివరాలతోసహా అందులో పేర్కొన్నాడు. తన భార్య గురించి ఓకనే ఏమన్నాడంటే...‘‘ఫర్ సేల్ వన్ వైఫ్’’ అంటూ మొదలు పెట్టి లియాండ్రాకు దైవభక్తి అస్సలు లేదని, తనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆమె కనీసం దైవపూజలు కూడా చేయలేదని, పైపెచ్చు తనను మాటలు, చేతలతో హింసిస్తోందనే అమ్మకానికి పెట్టానని తెలిపాడు.
అదే టైంలో ఆమె లోని మంచి క్వాలిటీస్ గురించి చెబుతూ... లియాండ్రా చక్కగా నవ్వుతుందని, జిమ్ వర్క్ చేయడంతో మరింత చక్కని బాడీ షేప్ ఆమె సొంతమని తెలిపాడు. వంటపనిలో ఆమెకు తిరుగులేదన్నాడు. ఎప్పుడూ లొడలొడ వాగుతుండడం ఆమెకున్న లోపమని చెప్పాడు. ఆమెను దక్కించుకున్నవాడు అదృష్టవంతుడని పేర్కొన్న సిమన్, ఆమె చాలా మంచిదని తెలిపాడు. ఇదే సమయంలో ఒకసారి అమ్మిన వస్తువు తిరిగి తీసుకోబడదని షరతు విధించాడు. ఈ భార్య సేల్ కు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. కేవలం రెండు రోజుల్లోనే 65,880 పౌండ్ల బిడ్లు వచ్చాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more