నయీం లింకులపై ఆ మాజీమంత్రికి నోటీసులు | SIT notices to ex minister in Gangster Nayeem Case

Sit notices to ex minister in gangster nayeem case

SIT notices to ex minister, SIT notices Nayeem case, SIT investigation in Nayeem Case, Nayeem Encounter, Gangster Nayeem updates, Nayeem encounter details, EX minster links with Nayeem, Nayeem with Ex minster, Nayeem political links

SIT notices to ex minister in Gangster Nayeem Case.

నయీం కేసులో ఆ మాజీమంత్రికి నోటీసులు

Posted: 09/16/2016 09:21 AM IST
Sit notices to ex minister in gangster nayeem case

గ్యాంగ్‌స్టర్ నయీం కేసు దర్యాప్తులో వేగం పెంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తాజాగా కీలక అడుగువేసింది. నయీంతో చేతులు కలిపి దందాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న నగరానికి చెందిన ఓ మాజీ మంత్రికి నోటీసులు జారీ చేసింది. నయీంను ముందుపెట్టి కోట్లాది రూపాయలు దండుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనగారిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం విపక్షంలో ఉన్న ఈ మాజీమాత్యులు గత కొంతకాలంగా అడ్రస్ లేకుండా పోయారు. దీంతో ఆయనను విచారించేందుకు నోటీస్ పంపినట్టు తెలుస్తోంది.

నయీం ఎన్‌కౌంటర్, సోదాలు, తర్వాతి పరిణామాలతో వణికిపోయిన ఆ నేత బంధువుల ఇంట్లో తలదాచుకున్నట్లు అధికారులకు సమాచారం అందింది. అధికారంలో ఉన్న పదేళ్లు గ్యాంగ్‌స్టర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్టు సిట్ దగ్గర పక్కా ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. నగరంలో భూమి కనిపిస్తే చాలు, జెండా పాతే అలవాటున్న ఈ మాజీ మంత్రి ఇందుకోసం నయీం సహకారాన్ని వాడుకున్నట్టు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. నయీం అండదండలతోనే ఆయన చెలరేగిపోయారని చెబుతున్నారు.

మాదాపూర్‌లో పది ఎకరాల భూమి సెటిల్‌మెంట్ వ్యవహారంలో నయీం మనుషులను పంపి మాజీ మంత్రి తనను బెదిరించారని ఓ వ్యాపారి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. నయీం కేసును విచారిస్తున్న సిట్‌కు ఈ విషయంలో స్పష్టమైన ఆధారాలు లభ్యం కావడంతో ఆయనను ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు నోటీసులు కూడా పంపించినట్టు సమాచారం. ఆయనతోపాటు విపక్షానికి చెందిన ఓ ఎమ్మెల్యేను కూడా విచారించాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gangster Nayeem  Encounter  EX minister  notices  

Other Articles