టెక్కీ స్వాతి హత్య కేసు నిందితుడి జైలులో ఆత్మహత్య పాల్పడిన ఘటన పోలీసు అధికారులతో మెడకు ఉచ్చుగా బిగుసుకుంటుంది. రామ్ కుమార్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అతని తండ్రి పరమశివం, సోదరులు పేర్కొంటుండగా, తమ బిడ్డను పోలీసులే హత్య చేసి, అత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కూడా వారు అరోఫిస్తున్నారు. స్వాతి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్‌కుమార్ జూన్ 24న నుంగంబాకం రైల్వే స్టేషన్లో స్వాతిని దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన రామ్‌కుమార్ అసలైన నిందితుడు కాదనే వాదనలు తొలి నుంచీ వినిపిస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో అటు ప్రజా సంఘాలు, ప్రతిఫక్షాలు కూడా ప్రభుత్వంతో పాటు పోలీసు అధికారులపై అరోపణలు గుప్పిస్తున్నాయి. స్వాతి హత్య కేసులో రామ్ కుమార్ అసలు నేరస్థుడు కాదని, దీంతో ఎక్కడ నిజాలు వెలుగులోకి వస్తాయోనని పోలీసులే రామ్ కుమార్ ను హతమార్చాయని అరోపణలు వినబడుతున్నాయి. కాగా జైలులో ఉన్న నిందితుడు కరెంటు వైరును నోటితో కొరికి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు మరోమారు తెరపైకి వచ్చింది. జైలులో వేలాది మంది ఖైదీలు, గస్తీ సిబ్బంది ఉండగా రామ్‌కుమార్ కరెంటు వైర్లను కొరికి ఆత్మహత్య చేసుకోవడంపై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రామ్‌కుమార్ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించిన తర్వాతే కుమారుడి మృతదేహాన్ని తీసుకుంటానని పరమశివం భీష్మించుకున్నారు. దీంతో ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించడంతో పోలీసులు ఇరుకున పడ్డారు. ప్రభుత్వానికి వారు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు నిందితుడి మృతదేహానికి పోస్టుమార్టంపై స్టే విధించిన మద్రాసు హైకోర్టు.. ఆయన పోస్టుమార్టాన్ని నలుగురు సభ్యులు గల వైద్యబృందంతో నిర్వహించాలని అదేశించింది. దీనికి డాక్టర్ బాలసుబ్రహ్మణ్యన్ నేతృత్వం వహించనుండగా, వైద్యులు సెల్వకుమార్, మణికండరాజా, వినోద్ లు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రిలో జరగాల్సిన పోస్టుమార్టాన్ని ఇవాళ నలుగురు సభ్యుల వైద్య బృందం నిర్వహించనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more