లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కుంటూ జైలు జీవితం గడుపుతున్న ఆశారాం బాపు మరోసారి తన వంకర బుద్ధిని ప్రదర్శించాడు. మొన్నామధ్యే ఫ్లైట్ లో అనుచరులతో హల్ చల్ చేసిన ఈ బాబా, ఇప్పుడు అల్లరి వెకిలి చేష్టలతో వార్తల్లో నిలిచాడు. ఓ నర్సుతో అసభ్యకరంగా మాట్లాడటమే కాదు, వైద్యులను విచిత్రమైన కోరిక కోరి తన అల్లరిని ప్రదర్శించాడు.
సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం ఆశారాంను శనివారం ఎయిమ్స్ కి చికిత్సకు తీసుకెళ్లగా, అక్కడ నర్సుతో ఆయన సెక్సీ కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది. టెస్ట్ లు చేసిన అనంతరం బ్రేక్ ఫాస్ట్ లో వెన్న, బ్రెడ్ ఇవ్వాలని వైద్యులు నర్సుకి సూచించారు. ఆ సమయంలో నర్సుని చూస్తూ 'నువ్వు వెన్నలా ఉన్నావు. నీ బుగ్గలు చూస్తుంటే కశ్మీర్ యాపిల్స్ గుర్తోస్తున్నాయి' అంటూ వ్యాఖ్యానించాడు. అంతే బిత్తరపోయిన ఆ నర్సు విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకెళ్లగా, వారు అధికారులకు తెలియజేశారు. ఇక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో తాను యువకుడిగా మారేలా చికిత్స చేయాలని అక్కడి వైద్యులను కోరటం మరో హైలెట్.
కాగా, లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో తీహార్ జైల్లో ఉంటున్న ఆశారాం బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు పరిశీలించనుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేయాలని సుప్రీం ఆదేశించింది. నడవలేని స్థితిలో ఉన్న ఆశారాంను దాదాపు 20 మంది పోలీసుల సాయంతో వీల్ చైర్‌లో ఆస్పత్రికి వచ్చారు. ఆశారాం బాపు ఆరోగ్యం కూడా ఏ మాత్రం బాగా లేదని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు తనను అస్తమానం టెస్ట్ లు చేస్తూ వేధిస్తున్నారని ఆశారాం అంటున్నాడంట. 75 ఏళ్ల ఈ ఫేక్ బాబాపై 2000 సంవత్సరం నుంచి పలు కేసులు నమోదయ్యాయి.
2008లో మెతెరాలోని ఆశ్రమంలో ఇద్దరు మైనర్ బాలుర హత్యకు గురికావటంతో ప్రజలు ఆందోళన చేపట్టగా, 2013లో ఏకంగా ఓ 16 అమ్మాయిపై అత్యాచారం చేశారనే ఆరోపణపై ఆశారాం బాపును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అలాంటి వ్యక్తిని మహాత్ముడని పొగుడుతూ మూడవ తరగతి పుస్తకంలో చిత్ర పటాన్ని ప్రచురించి రాజస్థాన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కుంది. ఇప్పటి వరకు ఆయన కేసుల్లోని సాక్షులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరుపుతూ వస్తున్నారు. ఈ కేసులో అత్యంత కీలక సాక్షి గా ఉన్న కిపాల్ సింగ్ తో సహా సమారుగా 9 మంది పై కాల్పులు జరిపారు ఇందులో ఏడుగురు మరణించగా మరో ఇద్దరు తీవ్ర గాయలపాలయ్యారు. ఇప్పటికీ ఈ కేసులో ఏలాంటి పురోగతి లేదు. గతం లో ఆశారాం బాబు అక్కడి ప్రభుత్వాలు మద్దతునిస్తున్నాయన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more