ధేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూపై బిహార్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కశ్మీర్ కావాలని పట్టుబడుతున్న పాకిస్థాన్ కు బిహార్‌ను కూడా కలపి ప్యాకేజీగా ఇస్తామని, బీహార్ వద్దన్న పక్షంలో కాశ్మీర్ ను కూడా పాకిస్థాన్ వదులుకోవాలని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఖడ్జూ తమ రాష్ట్రాన్ని, రాష్ట్రవాసులను అవమానించారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తగా, అటు జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ ఖర్జూపై ఫిర్యాదు చేశారు.
బిహార్‌ను పాకిస్థాన్‌లో కలపాలంటూ ఖర్జూ చేసిన వ్యాఖ్యలు 10 కోట్ల మంది బిహార్ ప్రజలతోపాటు దేశవిదేశాల్లో ఉన్న భారతీయులందరినీ తీవ్రంగా బాధించాయని నీరజ్ పేర్కొన్నారు. ఇక మరోవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని అవమానించడమేనని నితీశ్ పేర్కొన్నారు. ’బిహార్‌కు ఆయన తల్లీతండ్రా? లేక యజమానా’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కట్జూ పేరును నితీశ్ ప్రస్తావించనప్పటికీ పరోక్షంగా ఆయనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
న్యాయకోవిదుడైన వ్యక్తి ఇంత దారుణంగా ఒక రాష్ట్రాన్ని, ప్రజలను అవమానించడం దారుణమని అన్నారు. నిజానికి నితీశ్‌కు జస్టిస్ కట్జూకు మధ్య అంతగా సత్సంబంధాలు లేవు. గతంలో కట్జూ ప్రెస్ కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు బాహాటంగానే నితీశ్ సర్కారును దుయ్యబట్టారు. బిహార్‌లో ప్రతికా స్వేచ్ఛ ఏమాత్రం లేదని ధ్వజమెత్తారు. ఇటీవల రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కూడా జస్టిస్ కట్జూ తప్పుబట్టారు. దీంతో ఖడ్జూపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఆయనపై దేశ ద్రోహం కేసు పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more