గద్వాల జిల్లా కోసం ఎమ్మెల్యేగిరికి రాజీనామా..? Jayalalithaa 'recovering well,' says TN Governor

Jayalalithaa recovering well says tn governor

AIADMK, Ch Vidyasagar Rao, Health, Jayalalithaa, apollo hospital, chairman pratap reddy, Richard John Beale, States, Tamil Nadu

Tamil Nadu Governor C. Vidyasagar Rao visited Apollo Hospital here where CM J.Jayalalithaa was admitted for treatment last month and expressed happiness at her recovery.

జయలలిత అరోగ్యంపై అందోళన అనవసరం: గవర్నర్

Posted: 10/01/2016 09:20 PM IST
Jayalalithaa recovering well says tn governor

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ సీఎచ్‌ విద్యాసాగర్‌ రావు శనివారం రాత్రి ఓ ప్రకటన చేశారు. అనారోగ్యంతో ఉన్న సీఎం జయలలిత కోలుకుంటున్నారని ఆయన తెలిపారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను ఆయన పరామర్శించిన సంగతి తెలిసిందే. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లిన విద్యాసాగర్‌రావు ఈ ప్రకటన వెలువరించారు. జయలలిత త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆయన ఆక్షాంక్షించారు.
 
ముఖ్యమంత్రి జయలలిత అరోగ్యంపై సర్వత్రా అందోళన నెలకొన్న నేపథ్యంలో అమెకు ఏమైందన్న విషయంలో నిజాలను వెల్లడించాలని ప్రధాన ప్రతిపక్షం పార్టీ అధినేత కరుణానిధి డిమాండ్ చేసిన నేపథ్యంలో గవర్నర్ అమెకు సంబంధించిన అరోగ్య వివరాలు వెల్లడిస్తూ,, అమ్మ అరోగ్యం విషయంలో అందోళన అవసరం లేదని చెప్పారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి చైర్మన్‌ పత్రాప్‌ రెడ్డి తనకు వివరించారని గవర్నర్‌ తెలిపారు. జయలలితకు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్‌ ప్రకటనతో జయలలిత ఆరోగ్యంపై ఆమె అభిమానుల్లో ఆందోళన కొంత తగ్గింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : governor vidyasagarrao  Jayalalithaa  Tamil nadu  AIADMK  Jayalalithaa health  

Other Articles