తెలంగాణలో సామాన్యుడికి మరోసారి ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. ప్రతిష్టాత్మకమైన ఆరోగ్యశ్రీ పథకం సేవలు మంచం ఎక్కేయటంతో ఈ పరిస్థితి దాపురించింది. హామీ ప్రకారం ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదల కాకపోవటంతో మరోసారి వైద్యం నిరాకరించేందుకు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు సిద్ధం కాగా, ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. గతంలో బకాయిల కోసం ఆస్పత్రులు వారంపాటు సేవలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం విడతల వారిగా పూర్తిగా విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. కానీ, అది జరగలేదు.
దీంతో మరోసారి సేవలను నిలిపివేసేందుకు నిర్ణయించుకుని శనివారం అర్థరాత్రి నుంచే సేవలు నిలిపేశాయి. అయితే ఈసారి ఇది కాస్త ఉదృతంగా జరుగుతోంది. ఎందుకంటే ఇందులో కార్పొరేట్ ఆస్పత్రులు కూడా కలిశాయి కాబట్టి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోగా, రోగులు, ముఖ్యంగా పేదలు కష్టాలు పడుతున్నారు.
మరోవైపు అత్యవసర సేవలను కూడా ఆపేయాలని కొన్ని ఆస్పత్రులు డిసైడ్ అయ్యాయి. గతంలో ఎమర్జెన్సీ సేవలకు విఘాతం కలగకుండా మినహాయింపు ఇచ్చాం. కానీ, రెండు రోజుల్లో నిధులు విడుదల చేయకపోతే వాటిని కూడా నిలిపివేస్తామని తెలంగాణ హస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోషియేన్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఆరోగ్య శ్రీ నెట్వర్క్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 260 ఆసుపత్రులు ఉండగా, పథకం కింద 430 కోట్లు జారీ కావాల్సి ఉండగా, కేవలం 15 శాతం అంటే 40 కోట్లు మాత్రమే మంజూరు(అవి కూడా విడుదల కాలేదు) చేసిందని ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
గతంలో రెండు సార్లు హెచ్చరికలు, ఓసారి ఏకంగా సేవలను నిలిపివేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో విఫలం అవుతూ వస్తోంది. రెండు నెలల క్రితం 133 ఆసుపత్రులకు సంబంధించి రూ. 300 కోట్ల బకాయిలున్నాయని, వెంటనే బకాయిలు తీర్చాలంటూ సమ్మెలోకి దిగిన విషయం తెలిసిందే. దీనితో ప్రభుత్వం దిగివచ్చిన వారితో చర్చలు జరిపింది. అనంతరం విడుతల వారిగా చెల్లిస్తామన్న ఒప్పందం చేసుకుంది. మరోపక్క రిచ్ రాష్ట్రంగా చెప్పుకుంటున్న తెలంగాణలో ఆ మాత్రం నిధులు విడుదల చేయటం కేసీఆర్ సాధ్యం కావట్లేదా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more