కావేరి జలలా వివాదంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు బెట్టువీడిన కర్ణాటక ప్రభుత్వానికి దిగివచ్చింది. తమ రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చేందుకే తమ జలశయాలలో వున్న నీరు సరిపోదని వాదిస్తూ వచ్చిన కర్ణాటక ప్రభుత్వం.. సుప్రీంకోర్టు ధిక్కారానికి పాల్పడకూడదని నిర్ణయించుకుని ఎట్టకేలకు తమిళనాడుకు నిన్న రాత్రి కావేరి నీటి విడుదల చేసింది. అయితే ఎంతమేరకు నీటిని విడుదల చేసిందన్న వివరాలను మాత్రం గోప్యంగా వుంచింది. ఇవాళ మధ్యహ్నం రెండు గంటలలోపు ఎన్ని నీళ్లను వదిలారో చెప్పాలని సుప్రీం కోర్టు నిన్న అదేశించిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ మేరకు జలాలను విడుదల చేసింది.
అత్యున్నత న్యాయస్థానం కావేరి జలాల విడుదల విషయంలో ఇవాళ మరోమారు కేసును విచారించనుంది, కావేరి జలాల విషయంలో ఇప్పటికే రెండు పర్యాయాలు సర్వోన్నత న్యాయస్థానం అదేశాలను పెడచెవిన పెట్టిన కర్ణాటక ప్రభుత్వం గత్యంతరం లేకపోవడం.. న్యాయస్థానం దిక్కారానికి పాల్పడితే మనజామన్న ఉద్దేశంలో నిన్న రాత్రి నీటిని విడుదల చేసింది. కావేరి బోర్డు ఏర్పాటు విషయమై కూడా తాము కేంద్ర ప్రభుత్వాన్ని అదేశించలేమని, అది కేవలం కావేరి జల వివాద పరిష్కర ట్రిబ్యూనల్ ప్రతిపాదన మాత్రమేనని సుప్రీంకోర్టు నిన్న స్పష్టమైన అదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తుందో వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more