ఆర్మీ వీడియోలు ఎందుకు రిలీజ్ చేయకూడదంటే .. | Indian army ready to release Indian Surgical strike Video

Indian army ready to release indian surgical strike video

Indian army Green Signal for Surgical strike Video, Indian Surgical Strike Official Video Footage, Indian Surgical strike Video PMO final decision on Surgical Strike Video Footage, Indian Army Secret Videos

Indian army Green Signal to Central to release Surgical strike Video footage.

ఆర్మీ వీడియోలు బయటపెట్టడం అంతా ఈజీయా!

Posted: 10/05/2016 10:50 AM IST
Indian army ready to release indian surgical strike video

పాక్ ఉగ్రవాదులపై చేసిన సునిశిత దాడి(సర్జికల్ స్ట్రైక్) వీడియోను రిలీజ్ చేసేందుకు ఆర్మీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్మీ ఉన్నతాధికారులు కాసేటి క్రితం ఈ విషయంపై స్పందించారు. సర్జికల్ దాడి అసలు జరిగిందా అని రాజకీయ కోణంలో విమర్శలు వెలువెత్తుతున్న నేపథ్యంలో వీడియోను బయటపెట్టేందుకే సిద్ధమైనట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ప్రధాని కార్యాలయందే తుది నిర్ణయమని వారు చెబుతున్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ లాంటివాళ్లు సర్జికల్ స్ట్రైక్స్‌ ‘ఫేక్’ అని, నిజమైతే దానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని కోరటం తెలిసిందే. దీనిపై తీవ్ర రాజకీయ దుమారం సైతం రేగింది.

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైన్యం పాల్పడిన సర్జికల్ దాడిని మానవరహిత విమానాలతో షూట్ చేశాం. అది ఉగ్రవాదులకు పెద్దఎత్తునే నష్టం కలిగించిదన్నది వాస్తవం. ప్రభుత్వంలోని మంత్రులు, కొందరు ఉన్నత అధికారులు కూడా ఈ దాడులను ప్రత్యక్షంగా వీక్షించారు. అలాంటప్పుడు వారు చేసే ఆరోపణల్లో అర్థం లేదు అని సైనికాధికారి ఒకరు తెలిపారు.

సైనిక రహస్యాలను బయటపెట్టడం అనేది ఇప్పటివరకు ఎప్పుడూ లేదు. త్రివిధ దళాలకు సంబంధించిన ఆపరేషన్లు ఏవైనా సరే.. వాళ్లు చేశామని చెప్పడం తప్ప.. అందుకు సంబంధించిన ఆధారాలు చూపించిన దాఖలాలు లేవు. అయినా సరే, ఇప్పుడు ఆ వీడియో బయటపెడితే ఇటు దేశంలో ప్రశ్నిస్తున్నవాళ్లతో పాటు పాకిస్థాన్‌ నోరు కూడా మూయించినట్లు అవుతుందని అని ఆర్మీవర్గాలు భావిస్తున్నాయి.

ఇదిలా ఉండగా నియంత్రణ రేఖ వెంబడి నివసిస్తున్న కొందరు ప్రత్యక్ష సాక్ష్యులు ఈ దాడి గురించి స్పందించారు. పెద్ద ఎత్తున్న శబ్ధాలు వినిపించాయని, మృతదేహాలను అంత్యక్రియలకు ట్రక్కులో తీసుకెళ్తుండగా తాము చూశామంటూ ఓ జాతీయ దిన పత్రికకు వారు వివరాలను అందించారంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Surgical strike Video  Army  Ready  Release  PMO  

Other Articles