ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చుపెట్టి ఓట్లు కొనుగోలు చేశానని స్వయంగా ఒప్పుకున్నట్లు ఉన్న వీడియో ఒకటి ఇప్పుడు కోడెలను ఇరకాటంలో పడేసింది. సార్వత్రిక ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై 924 ఓట్లతో కోడెల గెలుపొందిన విషయం తెలిసిందే. ఆపై స్పీకర్ గా నియమితులయ్యారు కూడా.
కాగా, ఈ యేడాది జూన్ 19న ఓ ప్రైవేట్ చానెల్ ముఖాముఖి ప్రోగ్రాంకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఎన్నికల ఖర్చు గురించి ప్రస్తావిస్తూ... 1983 లో తాను నర్సారావుపేట నుంచి పోటీ చేసిన సమయంలో కేవలం 30 వేలు మాత్రమే ఖర్చు చేశానని, కానీ, 2014 ఎన్నికల సమయంలో మాత్రం తనకు 11.50 కోట్లు ఖర్చయ్యిందని పేర్కొన్నాడు. అంతే ఆ స్టేట్ మెంట్ తన గొయ్యి తానే తీసుకున్నట్లు అయ్యింది.
ఎన్నికల నిబంధనల ప్రకారం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి రూ.28 లక్షలకు మించి ఖర్చు చేయకూడదని ఉంది. అలాంటి వాటిని అతిక్రమించి ఏకంగా 28 లక్షలు ఖర్చు చేయటం ఏంటన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ విషయంపై రెండు రోజుల తర్వాత నర్సరావుపేట కాంగ్రెస్ నేత, ప్రముఖ న్యాయవాది అలెగ్జాండర్ సుధాకర్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాడు.
రాష్ట్రపతి భవన్ నుంచి కేంద్ర హోంశాఖకు ఆదేశాలు వెళ్లటం అక్కడ పూర్తి పరిశీలనల తర్వాత నిన్న(మంగళవారం) భారత ఎన్నికల కమిషనర్ కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ విషయంపై ఆదేశాలు అందాయి. చర్యలు తీసుకున్నాక తిరిగి వివరాలను తమకు తెలియజేయాలని రాష్ట్రపతి కార్యాలయం అందులో పేర్కొంది. మొత్తానికి ఏదో మాట్లాడాలన్న ఆత్రుతంలో చేసిన వ్యాఖ్యలతో కోడెల అడ్డంగా బుక్కయినట్లు స్పష్టం అవుతోంది. పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింకు క్లిక్ చేయండి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more