మతం ముసుగులో మోసం.. ఉద్యోగాల పేరుతో శఠగోపం.. Pastor held for sexually assaulting, murdering woman

Pastor held for sexually assaulting murdering woman

Millan Singh, Jeevitha, Ukkirankottai, Manur, K. Gandhimathi, Shanthi Nagar, Palayamkottai, Sankarankovil, preacher cheating, paster cheating, paster attempt murder case, paster sexuall assult, pastor cheated 40 women, G. Anbu Stella, government jobs, Kaveripakkam, crime

Police have arrested a pastor for allegedly sexually assaulting and murdering a woman job-seeker and attempting to murder another woman.

మతం ముసుగులో మోసం.. ఉద్యోగాల పేరుతో శఠగోపం..

Posted: 10/06/2016 09:24 AM IST
Pastor held for sexually assaulting murdering woman

మత ప్రబోధకుడు అనగానే శాంతి, సత్యం ఉట్టిపడేట్టుగా వుండాలి. సాక్షాత్తు ఆ యేసు ప్రభువు దూతలుగా క్రైస్తవులు ఆయనను కొలుస్తుంటారు. వారి మాటలకు అంతటి విలువనిస్తుంటారు. అయితే మతం ముసుగులో ఓ పాస్టర్ ఒక యువతిని హత్య చేయడం, మరో యువతిపై హత్యాయత్నానికి పాల్పడటం వెలుగుచూడటంతో తీగలాగిన పోలీసులకు ఆయన ఏకంగా 40 మందికి పైగా యువతలును మోసం చేశాడని తెలసింది. వారందరినీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నయవంచన చేసి వారి నుంచి డబ్బు దస్కం తీసుకుని శఠగోపం పెట్టినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.

శంకర్ కోవిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వెళ్తున్న కారులోంచి ఒక యువతి కిందపడి తీవ్రగాయాలపాలైంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అమెను విచారించగా, తనను రామనాథపురం సాయల్‌ కుడి గ్రామ చర్చి పాస్టర్ గా మిలనసింగ్‌ ఇక్కడ ప్రభుత్వ అధికారులను కలవాలని, చెప్పి తనను తీసుకువచ్చాడని తెలిపింది. అయితే మరికోంతసేపట్లో ప్రభుత్వ కార్యాలయాలకు చేరుకుంటామనగా, తనను బలంగా కారులోంచి నెట్టివేశాడని అమె పోలీసులకు పిర్యాదు చేసింది.

దీంతో పాస్టర్ మిలన్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న అతన్ని విచారించగా నివ్వెరపోయే నిజాలు వెలుగుచూడటంతో పోలీసులు షాక్ కు గుర్యాయరు. మతం ముసుగులో మాయమాటలు చెప్పిన పాస్టర్ 40 మందికి పైగా యువతులను ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి అందిన మేరకు డబ్బు, నగలు తీసుకుని శఠగోపం పెట్టినట్లు సమాచారం, అంతేకాదు వారిలో పలువురిపై పాస్టర్ అత్యాచారం కూడా చేశారని, డబ్బులు అడగిన వారిని అత్యాచారం తాలుకు ఫోటోలు వున్నాయంటూ కూడా బెదిరించాడని పోలీసులు తెలుసుకున్నారు.

అయితే అందిరిమాదిరిగానే ఈ పాస్టర్ మాయమాటలకు ప్రభావితమై.. ఆరు నెలల క్రితం పాళయంకోటకు చెందిన గాంధీమతి (30) అనే యువతికి కూడా పాస్టరుకు 5 లక్షల రూపాయలు, 15 సవర్ల బంగారు నగలు ఇచ్చింద. అయితే ఎంతకీ ప్రభుత్వ ఉద్యోగం అపాయింట్ మెంట్ అర్డరు రాకపోవడంతో.. అమె పాస్టరును గట్టిగా నిలదీసింది. దీంతో శంకర్ కోవిల్ లోని ప్రభుత్వ అధికారులను కలవాల్సిన పని వుందని అందుకు అమె రావాలని చెప్పాడు. దీంతో వీరిద్దరూ కలసి శంకర్ కోవిల్ ప్రభుత్వ కార్యాలయాలకు చేరువగా వెళ్తున్న క్రమంలో వేగంగా కదులుతున్న కారులోంచి ఆమెను కిందికి తోసేశాడు.

దీంతో గాయపడ్డ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని, కేసు విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో కామాంధుడైన పాస్టర్ మతం ముసుగులో సుమారు 40 మందికి పైగా యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాలకు అతని భార్య జీవిత కూడా సహకరించడం విశేషం. అతని చేతిలో మోసపోయిన వారిలో అన్బుసెల్వం (24) అనే యువతి గర్భందాల్చడంతో తనను కూడా వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది. దీంతో ఆమెను సజీవదహనం చేశాడు, ఇందుకు సహకరించిన నిందితుడి భార్య జీవితను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Millan Singh  Jeevitha  Ukkirankottai  Manur  K. Gandhimathi  Shanthi Nagar  Palayamkottai  Sankarankovil  crime  

Other Articles