తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల సంబురం అంబరాన్ని తాకింది. కొత్తగా ఏర్పాటు చేసిన 21 జిల్లాలను విజయదశమి రోజున ధనుర్ లగ్నంలో 11.13 గంటలకు అట్టహాసంగా ప్రారంభించారు. సిద్ధిపేట జిల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. నిర్ణీత సమయానికి సిద్ధిపేట కలెక్టర్ భవనానికి చేరుకున్న కేసీఆర్ తొలుత పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత, కేసీఆర్, హరీష్ రావులు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత, కొత్త జిల్లా శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆ తరువాత హారతి ఇచ్చి, బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి, దాన్ని పగలగొట్టి, రిబ్బన్ కట్ చేసి కలెక్టరేట్ భవంనంలోకి ప్రవేశించారు.
సిద్ధిపేట జిల్లాను తన చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సిద్ధిపేట జిల్లాను ప్రారంభించిన అనంతరం ఓపెన్ టాప్ వాహనంపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన... సిద్ధిపేటలో తనకు తెలియని వీధి, గడప లేదని అన్నారు. సిద్ధిపేట ఓ అద్భుతమైన ప్రాంతంగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. 30 ఏళ్ల క్రితమే సిద్ధిపేట జిల్లాను ఏర్పాటు చేయాలని ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను కోరానని... కానీ, అప్పట్లో అది సాధ్యం కాలేదని కేసీఆర్ చెప్పారు. 21 కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలోని మొత్తం జిల్లాల సంఖ్య 31కి పెరిగిందన్నారు
దీని వల్ల, రాష్ట్రంలో అదనంగా 21 మంది కలెక్టర్లు, 21 మంది ఎస్పీలు వచ్చారని... దీంతో, పరిపాలన మరింత మెరుగవుతుందని చెప్పారు. సిద్ధిపేటలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని హరీష్ రావు కోరారని... వచ్చే ఏడాది మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని చెప్పారు. సిద్ధిపేట అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయిస్తానని తెలిపారు. యువకుడైన హరీష్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారని... ఆయన నాయకత్వంలో జిల్లా అభివృద్ధిపథంలో పయనిస్తుందని చెప్పారు. హరీష్ కు నా ఆశీస్సులు అంటూ మేనల్లుడిని దీవించారు. తానెక్కడున్నా తన మనసు సిద్ధిపేట మీదే ఉంటుందని... ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకేనని కేసీఆర్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more