ఉత్తర్ ప్రదేశ్ లో పెను విషాదం.. తొక్కిసలాటలో 24 మంది మృతి 24 killed, over 60 injured in Varanasi stampede

24 killed over 60 injured in varanasi stampede

Varanasi, stampede, religious ceremony, Rajghat Bridge, Varanasi, Baba jai gurudev, PM Modi, CM Akhilesh Yadav, modi parlimentary constituency, suffocation, surging crowds, commotion.

24 died of suffocation because of the surging crowds, which led to a commotion. Rumours that the bridge had collapsed fueled more chaos in Prime minister Modi parlimentary constituency.

ఉత్తర్ ప్రదేశ్ లో పెను విషాదం.. తొక్కిసలాటలో 24 మంది మృతి

Posted: 10/15/2016 09:18 PM IST
24 killed over 60 injured in varanasi stampede

ఉత్తర్ ప్రదేశ్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ అథ్యాత్మిక గురువు నిర్వహించిన సభకు వేలల్లో భక్తులు కదిలిరావడంతో తోక్కిసలాట సంభవించి 23 మంది దుర్మణం చెందారు. బాబా జై గురుదేవ్ సభ  కారణంగా పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట సంభవించింది. తొక్కిసలాటలో 23 మంది మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో 15 మంది మహిళలు ఉన్నారు. వారణాశి, చందౌలీ మధ్య ఉన్న రాజ్ ఘాట్ వంతెన పై ఈ సంఘటన చోటు చేసుకుంది. 3000 మందికి అనుమతి ఉన్న బాబా జై గురుదేవ్ కార్యక్రమానికి దాదాపు 70వేల మంది హాజరవ్వడంతో ఈ దుర్ఘన జరిగినట్టు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయాలైన వారికి రూ.50 వేలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ పెను విషాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఈ విషాదం సంభవించిందని విపక్ష నేత మాయావతి అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varanasi  stampede  religious ceremony  Rajghat Bridge  Varanasi  

Other Articles