ఎన్టీఆర్ పై పుస్తకంలో మొత్తం వివాదాలేనా? | Dadi Veerabadra Rao book on NTR

Dadi veerabadra rao book on ntr

Book on NTR, Dadi Veerabadrarao book on NTR, Controversies in NTR book, CBN highlight in NTR Book, NTR vs ANR in NTR book, Laxmi Parvathi not administrator of NTR

Dadi Veerabadra Rao book on EX CM NTR.

ఎన్టీఆర్ పై దాడి ఏ రేంజ్ లో ఉండబోతుందో?

Posted: 10/17/2016 09:23 AM IST
Dadi veerabadra rao book on ntr

కేవలం తెలుగుదేశం పార్టీ పెట్టిన నెలల వ్యవధిలో దేశ రాజకీయాలను కుదిపేస్తూ కాంగ్రెస్ ను భారీ దెబ్బ కొట్టి మరీ జయకేతనం ఎగరవేసి రాజకీయాల్లో ఆరంగ్రేటంతోనే అధికారం చేజిక్కించుకున్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు. అలాంటి మహానేత చరిత్ర గురించి ఇంతవరకు ఎవరికీ అవగాహన లేదా? దానిని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారా? పోనీ ఇంతమంది వారసులు ఉండి కూడా దానిని ఎందుకు కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆయన జీవితం అంత వివాదాస్పదమా? లోతుగా పరిశీలిస్తే అవుననే అంటున్నారు దాడి వీరభద్రరావు.

ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ఎన్టీఆర్ గురించిన చాలా విషయాలు ఎవరికీ తెలియవని, ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ, తెలుగు ఇంగ్లీషు భాషల్లో ఒక పుస్తకం రాస్తున్నానని ఆయన తెలిపాడు. దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన ఎన్టీఆర్ గురించి సవివరంగా చెప్పాలన్న ఉధ్దేశంతో ఈ పుస్తకాన్ని రాస్తున్నానని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ కు సంబంధించిన అన్ని విషయాలు అందులో ప్రస్తావిస్తానని ఆయన స్పష్టం చేశాడు. ఆయనకు సంబంధించిన చాలా విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. తన పుస్తకం అన్ని విషయాలను వివరిస్తుందని తెలిపాడు.

ఇక ఇందులో వివాదాలకు చోటు ఉంటుందని తెలిపిన దాడి, చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్ మధ్య జరిగిన రాజకీయ ఘర్షణను కూడా సవివరంగా వివరిస్తానని చెప్పాడు. అసలు వారిద్దరి మధ్య సయోధ్యకు తాను ప్రయత్నించానని తెలిపాడు. 'సర్, మీరిద్దరూ రెండు అధికార కేంద్రాలుగా ఉండడం పార్టీలో అందరికీ ఇబ్బందిగా ఉంది... మీరు కలిసిపోతే బాగుంటుందని చంద్రబాబునాయుడుకు తాను సూచించానని దాడి చెప్పారు. దీంతో ఆయన కూడా సానుకూలంగా స్పందించి, ఆయనను కలవడంలో ఇబ్బందులేమున్నాయని చెప్పి ఎన్టీఆర్ ను కలిశారని గుర్తుచేసుకున్నారు. అయితే ఆ భేటీ కూడా సానుకూలంగా సాగలేదని ఆయన అన్నారు. ఆ తరువాత వారిద్దరినీ కలిపే ఎలాంటి అవకాశం రాలేదంట.

ఆనాటి పరిస్థితులను ఎన్టీఆర్ సరిగ్గా బేరీజు వేయలేకపోవటంతోనే ఈ పరిస్థితి దాపురించిందని చెప్పుకోచ్చాడు. వైస్రాయి హోటల్ లో జరిగిన ఘటనకు(ఎమ్మెల్యేల కొనుగోలు అని చంద్రబాబుపై ఆరోపణ) ముందు జరుగుతున్న పరిస్థితులను ఆయన తెలుసుకున్నప్పటికీ ఒక మొండి ధైర్యంతో ఉన్నారని అన్నారు. 'బ్రదర్! ఓట్లేయండని ప్రజలను నేను కోరితే గెలిచిన ఎమ్మెల్యేలు... నన్ను దించేసే పరిస్థితి ఉత్పన్నమవుతుందా?' అని ఆయన ఆలోచించారని దాడి చెప్పారు. వాళ్లు తనను ఊరికే బెదిరిస్తున్నారన్న ఆలోచనలో ఆయన ఉండేవారని ఆయన తెలిపారు. ఆయనను దింపేసే పరిస్థితి వచ్చినప్పుడు.. వ్యతిరేకవర్గాన్ని పిలవాలని తాము సూచించామని ఆయన అన్నారు. దానికి ఆయన అంగీకరించలేదని దాడి చెప్పారు.

'ఏమీ జరగదులే' అన్న ధైర్యం, వారికి తాను లొంగడమేంటనే ఆలోచన కూడా ఉండేదని, దీంతో ఆయన దానికి అంగీకరించలేదని అన్నారు. అందుకు బదులుగా ఆయన ఢిల్లీ నుంచి జాతీయ స్థాయి ఆస్ట్రాలజర్ ను తీసుకొచ్చి, చంద్రబాబు జాతకం ఇచ్చి చూడమన్నారని ఆయన తెలిపారు. దీంతో ఆ జ్యోతిష్యుడు 'రామారావు గారూ, మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు, చంద్రబాబుకు రాజయోగం లేదు, ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేద'ని చెప్పారని, ఆయన పట్టుదలకు జ్యోతిష్యుడు చెప్పిన మాటలు కలిసి రావడంతో ఆయనలో ధైర్యం పెరిగిందని ఆయన తెలిపారు. ఈ ఘటన జరిగిన తరువాత కూడా సదరు జ్యోతిష్యుడిపై ఆయనకు నమ్మకం పోలేదని...'చంద్రబాబు పుట్టినరోజు డేట్ తప్పా? లేక ఆయన అలా చెప్పాలని చెప్పారా?' అంటూ ఎన్టీఆర్ తనతో వ్యాఖ్యానించారని ఆయన చెప్పారు.

వివాహానంతరం అడ్మినిస్ట్రేషన్ లో లక్ష్మీ పార్వతి కలుగజేసుకుంటున్నారన్నది ఆమె వ్యతిరేకవర్గం ఆరోపణ అని దాడి వీరభద్రరావు తెలిపారు. అసలు ఒకరు చెబితే నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం ఆయనది కాదన్నారు. కొన్ని సందర్భాల్లో లక్ష్మీ పార్వతి ఏదైనా చెప్పాలని ప్రయత్నిస్తే... అదే సమయంలో మిగతా నేతలు ఏదైనా సలహా ఇస్తే, రెండవ దానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dadi Veerabadra Rao  Book on NTR  Controversies  

Other Articles