దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సహా జిల్లా కోర్టుల వరకు ఏ న్యాయస్థానం తీర్పును వెలువరించినా.. వాటిపై బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని, తీర్పు అనుకూలంగా రాలేదని భావించే వారు ఉన్నత న్యాయస్థానాలను అశ్రయించే అవకాశం కూడా మన దేశ న్యాయవ్యవస్థ మనకు కల్పించింది. అయితే దేశ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించి.. విధులు నిర్వర్తించిన మాజీ న్యాయమూర్తికి ఈ చిన్నవిషయం కూడా తెలియదా..? అన్న ప్రశ్నలు తాజాగా ఉత్పన్నమవుతున్నాయి.
ఆయన పయనించిన బాటను ఒక్కొక్కరుగా అన్వయిస్తే.. ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయన్న విషయం కూడా అర్థం చేసుకోలేదు ఆయన. సమాజంలో వాటి ప్రభావం ఎలా వుంటుందన్న ముందస్తు అలోచన లేకుండా.. తనకు అనిపించింది కదా అని ఏకంగా అత్యున్నత న్యాయస్థానాల తీర్పులపై బహిరంగ కామెంట్ చేశారు. అయితే ఇలా చేయడం కూడా తప్పే. అయినా తాను మాజీ సీజేఐ హోదాలో మాట్లాడుతున్నానని మార్కేండయ కట్జూ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది.
సంచలనం సృష్టించిన కేరళ సౌమ్య రేప్, హత్య కేసులో సుప్రీం వెలువరించిన తీర్పులో ప్రాథమిక తప్పులున్నాయని మార్కండేయ కట్జూ సెప్టెంబర్లో తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. ఈ విషయాన్ని కోర్టు సీరియస్గా తీసుకుంది.మాజీ సీజేగా విధులు నిర్వర్తించిన వ్యక్తిగా, సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తిగా కొనసాగుతున్న మార్కేండేయ కట్జూను తమ తీర్పులను తప్పుబట్టినందుకు గాను అయనను తమ ముందు హాజరుకావాలని కోరింది. అసాధారణ రీతిలో దేశంలోనే తొలిసారిగా ఓ మాజీ సుప్రీం కోర్టు జడ్జిని తన ముందు ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.
అందుకే ఆయనే స్వయంగా కోర్టుకు వచ్చి ఫేస్బుక్లో వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి’ అని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ యూయూ లలిత్ల బెంచ్ వ్యాఖ్యానించింది. తీర్పు ఇచ్చే ముందు జడ్జీలు సెక్షన్ 300ను క్షుణ్ణంగా పరిశీలించలేదని, ఈ కేసును బహిరంగ కోర్టులో పునర్విచారించాలని కట్జూ అనడం విచారకరమని అభిప్రాయపడింది. ఈ మేరకు కట్జూకు కోర్టు నోటీసులిచ్చింది. మాజీ జడ్జిని ఇలా ఆదేశించడం ఇదే తొలిసారని ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరైన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more