మమతా బెనర్జీ జోలికి వెళ్లిందని ఆ యువతిని... | Facebook Post On Mamata Banerjee Student in trouble

Facebook post on mamata banerjee student in trouble

Student Named On Big Banner Dum Dum, FB comments against CM Mamata, Mamata Benarjee MTech student

Student Named On Big Banner in Kolkata for Facebook Post On CM Mamata Banerjee,

మమతా బెనర్జీ జోలికి వెళ్లిందని ఆ యువతిని...

Posted: 10/18/2016 02:03 PM IST
Facebook post on mamata banerjee student in trouble

ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ తో సీరియస్ డిస్కషన్ లో పాల్గొన్న ఓ ఇంజనీరింగ్ యవతిని కోల్ కతాలో చెడుగుడు ఆడుకుంటున్నారు. దానికి కారణం ఏకంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైనే సీరియస్ వ్యాఖ్యలు చేయటం. అంతే ఆ యువతి బ్యానర్ పెట్టేసి మరీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

డమ్ డమ్ ప్రాంతంలో నివసించే 21 ఏళ్ల ఎంటెక్ అమ్మాయి ఫేస్ బుక్ లో స్నేహితులతో ఓ చర్చను మొదలుపెట్టింది. అందులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించిన దుర్గామాత పరేడ్పై చర్చించింది. ఓవైపు నిరుద్యోగ, పేదరిక సమస్యతో బెంగాల్ పోరాటం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రియో ఉత్సవంలో ఎంతో అట్టహాసంగా పరేడ్ నిర్వహించడాన్ని తప్పుడు చర్యగా ఆమె అందులో పేర్కొంది. అంతే ఆ చర్చ ఆమెకు పెద్ద తలనొప్పిగా మారింది.

student trouble with post against mamata benarjee

గత శుక్రవారం ఆ అమ్మాయి విమర్శించగా, ఆదివారం ఆమె ఫోటోతో కూడిన ఓ పెద్ద బ్యానర్ విద్యార్థి నివసించే  ప్రాంతాల్లో వెలసింది. ముఖ్యమంత్రిని విమర్శించడాన్ని తాము ఖండిస్తున్నామంటూ పెద్దపెద్ద అక్షరాలతో బ్యానర్పై లిఖించారు. ఈ బ్యానర్ను చూసిన అమ్మాయి ఒక్కసారిగా బిత్తరపోయింది. వేలమంది ఈ పోస్టర్ను చూస్తారని తాను భయపడటం లేదని, స్థానిక తృణమూల్ కాంగ్రెస్ మహిళ సభ్యుల వల్ల తనకేమన్న ముప్పు వాటిల్లుతుందేమోనని ఆందోళన చెందుతున్నట్టు ఆ విద్యార్థి పేర్కొంది. మరోవైపు స్థానికులు కూడా ఆమె చేసిన చర్యను తప్పుబడుతున్నారు.

అయితే మమతా బెనర్జీని విమర్శించే హక్కు తనకుందని ఆ అమ్మాయి భావిస్తే, తనని బహిరంగంగా నిందించే హక్కు ఇతరులకు ఉంటుందని అందులో వారు బెదిరించారు. ఆమె ఫేస్బుక్ చర్చలో కొంతమంది స్నేహితులు ఆ విద్యార్థికి మద్దతు పలుకగా, మరికొంతమంది వ్యతిరేకించారు. కానీ ఆ పోస్టు ఇంతపెద్ద సమస్యకు కారణమవుతుందని తాను భావించలేదని ఆ విద్యార్థిని చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : West Bengal  CM Mamatha Benarjee  Trouble  MTech student  FB banner  Dum Dum area  

Other Articles