పార్లమెంటులోలో అపరకాళీలా మారి విపక్షాలను ఒక్క ఉదుటన ఉతికేసీ యావత్ భారత ప్రజల చేత ఔరా అనిపించుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఈ ఏడాది చెప్పుకోదగ్గ ఘనత అదే. ఎందుకంటే అంతకుమించి అమె విషయంలో ఏదీ కూడా సవ్యంగా సాగడం లేదు. అమె విద్యార్హతల విషయంలో సుప్రీంకోర్టులో ఊరట లభించన అమెకు ఈ ఏడాదలో వరుస దెబ్బలు తగులుతున్నాయి. అమెకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి పదవి నుంచి తప్పించి, చేనేత శాఖా మంత్రిగా బదిలీ చేయడం నుంచి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి.
అమెతో పాటు మంత్రిత్వ శాఖ బదిలీని ఎదుర్కోన్న సదానంద గౌడ ఇద్దరికీ ఈ పరిణామాలు ఎదురవుతున్నాయి. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమన్వయం కోసం పనిచేసే అంతర్రాష్ట్ర మండలి నుంచి ఈ ఇద్దరు కేంద్రమంత్రులను తప్పించారు. ప్రధాని మోదీ అధ్యక్షులుగా ఉన్న ఈ మండలిలో కొత్తగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను సభ్యునిగా తీసుకున్నారు. మండలిలో మార్పులుచేర్పులు జరిగాయని తాజాగా విడుదలైన ఓ ఉత్తర్వు ద్వారా తెలుస్తోంది. మండలి స్టాండింగ్ కమిటీలో ఎలాంటి మార్పులు లేవు.
న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇకమీదట కూడా మండలిలో కొనసాగనున్నారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య సమస్యలు ఉత్పన్నమైతే పరిష్కారం చూపేందుకు 1990 మేలో ప్రధాని అధ్యక్షతన అంతరాష్ట్ర మండలిని ఏర్పాటుచేశారు. ప్రస్తుత మండలిలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలు, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, మనోహర్ పరీకర్ సభ్యులుగా ఉన్నారు. వీరుగాక మరో పదిమంది కేంద్రమంత్రులు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more