రిలయన్స్ జియో నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు మొబైల్ పోర్టబిలిటీని వినియోగదారులు వినితి మేరకు కల్పించకుండా పెండింగ్ లో పెడుతున్నట్లు అభియోగాలను ఎదుర్కోంటున్న దిగ్గజ టెలికాం ఆపరేటర్లకు షాకిస్తూ ట్రాయ్ సంచలన సిఫార్సు చేసింది. రిలయన్స్ జియోకు ఉద్దేశపూర్వకంగా ఇంటర్ కనెక్టివిటీని కల్పించేందుకు నిరాకరిస్తున్నారని పేర్కొంటూ ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్‌పై 3,050 కోట్ల రూపాయల జరిమానా విధించాలని టెలికం శాఖకు సిఫార్సు చేసింది. లైసెన్సు కండీషన్లు, సేవల నాణ్యతా నిబంధనలను ఈ మూడు కంపెనీలు పాటించడం లేదని ట్రాయ్ పేర్కొంది.
వీటి కారణంగా ఆర్‌జియోకు కేటాయించిన ఇంటర్ కనెక్ట్ పాయింట్ల వద్ద సమస్యలు ఏర్పడి కాల్స్ ఫెయిల్యూర్లు భారీగా జరగుతున్నాయని తెలిపింది. ఆర్‌జియోకు పోర్టులు కేటాయించేందుకు ఈ కంపెనీలు తిరస్కరించడం పోటీని పరిమితం చేయడమేనని, ఈ చర్య వినియోగదారులకు వ్యతిరేకమైనదని ట్రాయ్ విమర్శించింది. వీటిని దృష్టిలో ఉంచుకొని ఎయిర్‌టెల్, వొడాఫోన్‌కు ఒక్కొక్క కంపెనీకి 1,050 కోట్ల రూపాయల చొప్పున, ఐడియాకు 950 కోట్ల రూపాయల చొప్పున జరిమానా విధించాలని సిఫార్సు చేసింది.
ఈ మూడు కంపెనీల లైసెన్సులు రద్దు చేయాలని కానీ వినియోగదారులకు ఏర్పడే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ పని చేయడంలేదని తెలిపింది. తమ నెట్‌వర్క్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌లో 75 శాతం కాల్స్ ఫెయిల్ అవుతున్నాయని, ఇందుకు ఈ కంపెనీలు తగినన్ని పోర్టులు కేటాయించకపోవడమే కారణమని ఆర్‌జియో చేసిన ఫిర్యాదుపై ట్రాయ్ విచారణ జరిపింది. ఈ కంపెనీల చర్య ప్రజా ప్రయోజన వ్యతిరేకమైనదని డిఒటికి రాసిన లేఖలో ట్రాయ్ పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more