కారు టైర్లపై మూత్రపోసిందని ఆ దుర్మార్గుడు ఏం చేశాడో చూడండి | Man runs over stray dog for peeing on his car

Man runs over stray dog for peeing on his car

Man runs over stray dog for peeing, Saurabh Dukhande post, Mumbai man ran car over dog, Dog spinal card accident, FB post on Car pass on Dog

Man runs over stray dog for peeing on his car in Mumbai.

ITEMVIDEOS:కారు టైర్లపై మూత్రం పోసిందని కిరాతకంగా...

Posted: 10/24/2016 04:15 PM IST
Man runs over stray dog for peeing on his car

మూగజీవాలను హింసించడం, దానిని వీడియోలుగా తీసి సోషల్ మీడియాల్లో వైరల్ చేయటం మూర్ఖులకు ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. క్రూరంగా వాటిపై చేస్తున్న దాడుల వీడియోలను చూస్తే విచక్షణ లేనిది వాటికా? మనకా? అన్న అనుమానాలు ఎవరికైనా కలుగుతాయి. ముఖ్యంగా విశ్వాసం చూపించే శునకాల విషయంలో....

బిల్డింగ్ లనుంచి తోసేయటం, కాల్చి చంపేయటం, మంటల్లో తోసేయం, గిరగిరా తిప్పి నేలకు కొట్టడం ఇలా చెప్పుకుంటే పోతే ఆ మానవ మృగాల దాష్టీకాలకు అంతే లేదు. ఇక ఇప్పుడు అలాంటిదే మరో ఘటన... కారు టైర్లపై మూత్రం పోసిందని దానిపై నుంచి కారును పోనిచ్చాడు ఓ రాక్షసుడు. వసై ముంబై ప్రాంతానికి చెందిన సౌరభ్ దేశ్ పాండే అనే వ్యక్తి చేసిన ఈ నిర్వాకంపై సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి.

కారును కుక్కపై పోనివ్వగానే అది గిలగిల లాడిపోవటం, మిగతా కుక్కలు పరిగెత్తుకు రావటం, చివర్లో ఒక కుక్క అయితే కారు వెంట పడటం చూస్తుంటే మానవత్వం మనకన్నా వాటిలోనే ఎక్కువ ఉందన్నది అర్థమౌతుంది. 19వ తేదీన నమోదైనట్లుగా సీసీ కెమెరాలో రికార్డయిన ఆ వీడియోను బయటపెట్టడంతో అంతా సౌరభ్ పై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఆ కుక్క వెటర్నరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. భవిష్యత్తులో అది నడవలేదని డాక్టర్లు చెబుతున్నారు.

‘‘సిగ్గు లేని వ్యక్తి. అమాయకపు మూగ జీవాలపై అలా క్రూరంగా వ్యవహారించాడానికి మనసేలా వచ్చింది? మూత్రం పోసిందన్న ఒకే ఒక్క కారణంతో దానిపై నుంచి కారును పోనిచ్చి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఫిర్యాదు చేసిన ఎవరూ చర్య తీసుకోవటం లేదు. ఆ మూగజీవి నరకం అనుభవిస్తోంది. వాడు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఈ సందేశాన్ని షేర్ చేయండి. వాడికి శిక్ష పడేలా చేయండి’’ అంటూ ఓ ఫోస్ట్ ఫేస్ బుక్ లో వైరల్ అవుతోంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Mumbai Man  Pass Car  stray dog for peeing  Face Book post  

Other Articles