పోలీస్ అకాడమీపై అర్థరాత్రి ఉగ్రదాడి... 59 మంది దుర్మరణం | terror attack on Police Academy in Quetta

Terror attack on police academy in quetta

Quetta terror attack, Pak Police academy terror attack, terror attack on Pak police academy, terror attack on Police Academy in Quetta

59 died and hundred wound in terror attack on Police Academy in Quetta Pakistan.

పోలీస్ అకాడమీపై ఉగ్ర పంజా... 59 మంది మృతి

Posted: 10/25/2016 07:25 AM IST
Terror attack on police academy in quetta

ఉగ్రనీడలోని పాకిస్థాన్‌ మరోమారు రక్తమోడింది. నైరుతి పాకిస్థాన్ ప్రాంతంలోని ఓ పోలీస్ అకాడమీపై ఉగ్రవాదులు చెలరేగిపోవటంతో సుమారు 59 మంది అక్కడికక్కడే మృతి చెందారు. రాత్రి సమయంలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో వందలాదిమంది గాయపడ్డారు.

క్వెట్టాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బలూచిస్థాన్ పోలీస్ కాలేజీపై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఉగ్రవాదులు దాడి చేశారు. దాడిలో 44 మంది ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రిలో మరో 15 మంది చనిపోయారు. 118 మంది గాయపడినట్టు బలూచిస్థాన్ హోంమంత్రి సర్ఫరాజ్ బుగ్తి పేర్కొన్నారు. ఈ ఏడాది పాకిస్థాన్‌లో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడుల్లో ఇది మూడోది. దాడిలో ఐదారుగురు ఉగ్రవాదులు పాల్గొనట్టు పోలీసులు చెబుతున్నారు. ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మిగిలిన ఉగ్రవాదులు కాలేజీ వసతి గృహంలో ఉన్న వారిని బందీలుగా పట్టుకున్నట్టు తెలుస్తోంది.

పాకిస్థాన్ తాలిబన్‌కు అనుబంధమైన లష్కరే ఝంగ్వి ఉగ్రవాద సంస్థకు చెందిన అల్-అలిమి ఫ్యాక్షనే దాడికి పాల్పడినట్టు తమ వద్ద సమాచారం ఉందని మంత్రి తెలిపారు. అయితే ఆ సంస్థ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. దాడి జరిగిన సమయంలో కాలేజీ వసతి గృహంలో 700 మంది వరకు ఉన్నట్టు బుగ్తి తెలిపారు. వారిలో చాలామందిని రక్షించినట్టు పేర్కొన్నారు. కాగా మిలటరీ కౌంటర్ ఆపరేషన్ పూర్తయిందని కొద్దిసేపటి క్రితం అధికారులు తెలిపారు. ప్రత్యేక దాడులు జరుగుతాయన్న ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవటంతోనే ఇంత పెద్ద ఎత్తున్న ప్రాణ నష్టం సంభవించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Quetta  Police Academy  Terror attack  59 died  

Other Articles