ప్రేమిస్తే పెద్దవాళ్లను ఒప్పించడం. లేదంటే ఇంట్లోంచి తీసుకెళ్లి ఆమెను సుఖంగా చూసుకోవటం. ఈ రెండు చాతకాకపోతే వారి జీవితం నుంచి తప్పుకుని వారిని ఆశీర్వదించాలి. కానీ, ఇక్కడో సైకో మాత్రం ఆ అమ్మాయి అక్క జీవితంతో ఆడుకున్నాడు. తన ప్రేమకు అడ్డంగా ఉందని భావించి ఆమెను వేధించేందుకు మాస్టర్ ఫ్లాన్ వేసి చివరకు అతనే బుక్కయ్యాడు.
మైసూరులోని జయలక్ష్మిపురంలో ఓ మహిళ తన ఇద్దరు చెల్లెళ్లతో కలిసి నివసిస్తోంది. స్థానికంగా ఓ ప్రైవేటు కళాశాలలో ఆమె అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఆమె చెల్లెలితో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్తా ప్రేమగా మారింది. వారి ప్రేమ విషయం తెలుసుకున్న అక్క యువకుడిని, తన చెల్లిని ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చింది. మరోసారి కలవాలని చూస్తే పోలీస్ ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది.
దీంతో అతడు మృగంగా మారిపోయాడు. చెల్లిపై ప్రేమను కాస్త అక్కపై పగపై మార్చుకున్నాడు. అధ్యాపకురాలి పేరుతో ఫేస్బుక్లో నకిలీ అకౌంట్ తెరిచాడు. ఆమె బంధువులకు, స్నేహితులకు, ఆఖరికి ఆమె పనిచేస్తున్న కళాశాలలోని విద్యార్థులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపి, ఆపై వారితో అశ్లీల వీడియోలు షేర్ చేయడం, బూతు చాటింగ్ లు చేయటం మొదలుపెట్టాడు. ఆపై మరో అడుగు ముందుకు వేసి ఫోన్ నంబర్ ను కూడా పంచిపెట్టాడు. అప్పటి నుంచి ఆమెకు బయట వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చేవి.
వారంతా చాలా అసభ్యకరంగా మాట్లాడటంతో ఇబ్బందికి గురైన ఆమె చివరకు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని ట్రేస్ చేసి పట్టుకున్న పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తి కావటంతో వివరాలు గోప్యంగా ఉంచి రాజీ కోసం యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more