సిగరెట్, మద్యం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రకటనలు దంచే యాడ్ లు ఓ పక్క ప్రచారం చేస్తుంటే మళ్లీ ఈ వార్త ఏంటంటారా? అక్కడికే వస్తున్నాం. జంతువుల పరిరక్షణకు పోరాడే పెటా (జంతు సంరక్షణ సంస్థ) పీపుల్స్ ఫర్ ది ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ ఎనిమిల్స్) తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది. అందులో మీ కోసమే ఈ బీరు అంటూ చెబుతోంది.. అంతేనా గాట్ పేరిట ఓ ప్రొడక్ట్ ను రిలీజ్ చేసింది కూడా.
అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్శిటీ మాడిసన్ క్యాంపస్ కు దగ్గర్లో 'గాట్ బీర్' పేరుతో ఓ బిల్ బోర్డును చూడొచ్చు. పాలు తాగడం కంటే బీరు తాగడమే ఆరోగ్యానికి మంచిదనే విషయం సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందని అందులో పేర్కొంది. పాలకన్నా బీరు బలవర్ధకమైనదని, ఎముకల పటుత్వాన్ని పెంచడమే కాకుండా ఆయుష్షును కూడా పెంచుతుందని తెలిపింది. పాల ఉత్పత్తులను వాడటం ద్వారా ఎముకలు గుల్లబారే ప్రమాదం ఉందని పెటా వెల్లడించింది. పాలు సేవించడం వల్ల డయాబెటిస్, ఒబేసిటీ, కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. ఈ నేపథ్యంలో, 'ఇట్ ఈజ్ అఫీషియల్' అంటూ బీరుకు ప్రచారం చేస్టోంది పెటా.
2000 సంవత్సరంలో కూడా బీరుకు అనుకూలంగా పెటా ప్రచారం చేసింది. అయితే, పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో అప్పట్లో వెనక్కి తగ్గింది. పాల కోసం లక్షలాది ఆవులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని... పాల వినియోగం తగ్గితే, వాటిని హింసించడం కూడా తగ్గుతుందనే ఉద్దేశంతో బీర్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నామని తెలిపింది. అయితే ఆల్కహాల్ మితంగా తీసుకోవడం అన్న ఆరోగ్య సూత్రానికి అనుగుణంగా తాము ఈ ప్రకటనలో భాగస్వాములం అయ్యామని పెటా ఉపాధ్యక్షుడు ట్రేసీ రీమన్ చెబుతున్నాడు.
కానీ, నిపుణులు మాత్రం పెటా బుద్ధి లేని ప్రకటన అంటూ తిట్టి పోస్తున్నారు. వారు ఏం చెబుతున్నారంటే ఇండియాలో ప్రతీ 90 నిమిషాలకు ఆల్కహాల్ మూలంగా ఓ వ్యక్తి మరణిస్తున్నాడు. 2013 నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ఈ విషయాన్నే ధృవపరుస్తోంది. భారత్ లాంటి పెద్ద కంట్రీలోనే ఇలా జరిగినప్పడు, పాలు కన్నా బీరు మేలని మీరెలా చెబుతారు, ఈ లెక్కన పిల్లలను మద్యం సేవించమని చెబుతారా? అంటూ వారు పెటాపై మండిపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more