భారత దేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయి పటేల్. జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించాడు. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోధ్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు.
బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు.
రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు. స్వాతంత్రానంతరం జవహార్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రి గాను, ఉప ప్రధానమంత్రి గాను బాధ్యతలను నిర్వహించాడు.
దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేధించాడు. ఇతను ప్రముఖ స్వాతంత్ర యోధుడు మాత్రమే కాడు, స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సపలుడైన ప్రముఖుడు.
హైదరాబాదు, జునాగఢ్ లాంటి మొండి సంస్థానాలను భారతదేశము లో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. కాస్తుంటే కశ్మీర్ కూడా మనలో కలిసిపోయేదే. కానీ, నెహ్రూ ఐక్యరాజ్యసమితి దౌత్యంతో అదంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. అంతేకాదు నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైయ్యాడు పటేల్. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్దతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదాన్ని ఇచ్చి గౌరవించింది. ఆయన జయంతి సందర్భంగా గౌరవార్థం ఓ గేయం...
కదలిరా...కదలిరా...కదలిరా
వినిపించవోయ్ మన జాతీయ గీతాన్ని
ప్రకటించవోయ్ మన ఐక్యతా భావాన్ని
పూరించవోయ్ మనశాంతి సమరాన్ని
అందించవోయ్ మన ప్రేమాను రాగాన్ని
కదలిరా...కదలిరా...కదలిరా ఓ భారతీయుడా!!
మన ప్రాంతం, మన రాష్ట్రం, మన దేశం ఒక్కటేరా
కుల,మతాలకు, రాగద్వేషాలకు,
బీద,ధనిక వర్గాలకు అతీతమైనదిరా
అదే మన భారతీయతరా
కదలిరా...కదలిరా...కదలిరా ఓ భారతీయుడా!!
త్రివర్ణ పతాకం రెపరెప లాడాలి ప్రతి రోజు
అందరి హృదయాలలో వెలగాలి జాతీయ జ్యోతులు
ప్రసరించాలి నలుదిశలా అభ్యుదయ కిరణాలు
వికశించాలి భారతీయతా పుష్పాలు
కదలిరా...కదలిరా...కదలిరా ఓ భారతీయుడా!!
కావాలి మనందరకు కూడు,గుడ్డ,నివాసం
నిండాలి మన నదీనదాలు, జలకళలతో
పండాలి మన పాడి పంటలు సమృద్దిగా
తీరాలి మన రైతుల కష్టాలు కలకాలం
కదలిరా...కదలిరా...కదలిరా ఓ భారతీయుడా!!
మంచు కొండల నడుమ, దట్టమైన అడవులలో
అందరకు దూరంగా, అకుంఠిత దీక్షతో మనుగడ సాగిస్తూ
దేశాభ్యు దయమే తమ జీవిత లక్ష్యంగా
కాపాడుతున్న మన వీర జవానులకు
అందించాలి వారికి మనోధైర్యాన్ని, నిలబడాలి వారికి అండ దండలై
కదలిరా...కదలిరా...కదలిరా ఓ భారతీయుడా!!
చూపించాలి వారికి ఐక్యతా భావాన్ని, వినిపించాలి వారికి మన నాదాన్ని
జై,జవాన్ ..జై,జవాన్ ..భారత్ మాతాకీజై, భారత్ మాతాకీజై, ఏక కంఠంగా.
కదలిరా...కదలిరా...కదలిరా ఓ భారతీయుడా!!
- ఇట్లు మీ
రఘురాం పాటిబండ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more