కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు ఇవాళ రెండు పర్యాయాలు అదుపులోకి తీసుకున్నారు. వన్ ర్యాంకు వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) పథకం ఆచరణలోకి రావడం లేదనే మనస్తాపంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి రామ్ క్రిషన్ గ్రెవాలే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి.. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లిన రాహుల్ గాంధీని, భాధిత కుటుంబసభ్యులతో మాట్లాడనీయకుండా అడ్డుకున్నారు, అస్పత్రి గేట్లు మూసివేసి అయనను నిలువరించారు.
దీంతో కోపోద్రేకుడైన రాహుల్.. ఇదే కొత్త భారత్ అని వ్యాఖ్యానించారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అనంతరం అక్కడున్న సిఐతో ఆయన వాగ్వాదానికి దిగారు. తనను ఇక్కడకు ఎందుకు తరలించారని ప్రశ్నించారు. తనను అరెస్టు చేశారా.? అని అడిగారు, ఉన్నతాధికారుల అదేశాల మేరకు తాము ఇలా చేశామని చెప్పగా.. అదేశాలిచ్చిన అధికారులు ఎవరని ప్రశ్నించారు., అయితే తన ఎదురుగా వున్న బాధిత కుటుంబ సభ్యులను అరెస్టు చేశారా..? అని ప్రశ్నంచారు.
మృతుడి కుటుంబసభ్యులను కూడా అదుపులోకి తీసుకుని పోలిస్ స్టేషన్ కు తరలించడానికి సిగ్గు వేయడం లేదా.? దేశానికి సేవలందించిన మాజీ సైనికుడు ఆత్మహత్యకు పాల్పడితే దానిని కూడా రాజకీయం చేస్తూ పరామర్శించడానికి వచ్చిన నేతలను అరెస్టు చేస్తారా.? మృతుడి కుటుంభసభ్యులను కూడా అరెస్టు చేసి నిర్భందిస్తారా అని అగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శించడానికి వచ్చిన నేతలతో మృతుడి కుటుంబసఢ్యులను కూడా కలవనీయకుండా రాజకీయం చేస్తారా..? అని నిలదీశారు.
ఆ తరువాత కొద్ది సేపటికి ఉన్నతాధికారులు అదేశాల మేరకు రాహుల్ గాంధీని పోలీసులు వదిలిపెట్టారు. దీంతో మళ్లీ అస్పత్రికి వెళ్లి మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. అయితే రాహుల్ గాంధీని మరోమారు పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకున్నారు. న్యాయం చేయాల్సింది పోయి, మృతుడి కుమారుడిని ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. తనను కూడా అరెస్ట్ చేయాలంటూ రాహుల్ సవాల్ విసిరారు. ఒక యోధుడి కుమారుడి పట్ల అలా ప్రవర్తించడం దారుణమన్నారు. ఇది సిగ్గుచేటు చర్య అని ఆయన అభివర్ణించారు. రెండోసారి అదుపులోకి తీసుకున్న రాహుల్ ను పోలీసులు తిలక్ మార్గ్ పీఎస్కు తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more