(కా)కీచకుడు: ప్రేమించాడు.. కానీ పెళ్లి చేసుకోడు..! si cheats young girl on pretext of marriage

Si cheats young girl on pretext of marriage

SI sunil kumar, choudepally, boyekonda, palmaneru, police man cheats young girl, si cheats young girl, harrasement on woman, cheating women, threatening woman, crime

SI sunil kumar from chittoor cheated a young girl on pretext of marriage, and lured Rs 10 lakhs for house construction from her.

(కా)కీచకుడు: ప్రేమించాడు.. కానీ పెళ్లి చేసుకోడు..!

Posted: 11/03/2016 12:44 PM IST
Si cheats young girl on pretext of marriage

ప్రేమ పేరుతో నయవంచన చేసిన కాకీచకులు జాబితోలో మరో ఎస్ ఐ చేరిపోయాడు. అమాయకులైన అమ్మాయిలను ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి.. పెళ్లి చేసుకుంటామని అబద్దపు ప్రమాణాలు చేసి, వారి నుంచి సర్వం దోచుకున్న తరువాత.. అది చాలదన్నట్లు డబ్బు, ధనం దస్కం అన్నింటినీ అదను చూసి మరీ తీసుకుని మోసం చేశాడు. తనను ఎప్పుడు పెళ్లి చేసుకుంటామని అడిగితే.. అమెను మాయమాటలతో దాటవేసేవాడు. దీంతో లాభం లేదని నిలదీసిన యువతిని చంపుతానని బెదిరింపులకు దిగాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఉన్నతాధికారులను అశ్రయించింది ఆ బాధితురాలు.

బాధితురాలి కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయికొండకు చెందిన యువతి డిగ్రీ వరకు చదువకుని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసింది. తన తల్లిదండ్రుల సహకారంతో హోటల్ వ్యాపారం నిర్వహిస్తుంది. దాని నిర్వహణ కోసం పర్మిషన్ కోసం పలమనూరు డీఎస్సీ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న సునీల్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. సునీల్ కుమార్ తొలుత అప్పడప్పుడు ఫోన్ చేసిన పరిచయం పెంచుకున్నాడు. ఆ తరువాత క్రమంగా ఫోన్ చేసేవాడు.

ఇలా తమ పరిచయాన్ని ఆయన ప్రేమగా మలిచాడు. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. దీంతో తన కాబోయే భర్తే కదా అనుకుందో.. ఏమో తెలియదు కానీ అతడికి అన్నీ అర్పించుకుంది. దీనికి తోడు ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పి యువతి దగ్గర అడపాదడపా పది లక్షల  రూపాయలను కూడా సునీల్ కుమార్ రెడ్డి తీసుకున్నాడు. అన్ని అయిన తరువాత పెళ్లి ఎప్పుడు అని యువతి నిలదీస్తే.. దాటవేత ధోరణి అవలంభించేవాడు. నిలదీసి అడిగితే చంపుతానని బెదిరింపులకు దిగుతున్నాడని భాదితురాలు తెలిపింది. తనకు న్యాయం చేయాలని మీడియాను అశ్రయించింది. ఉన్నతాధికారులైనా తనకు న్యాయం చేయాలని కోరుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SI sunil kumar  choudepally  boyekonda  palmaneru  crime  

Other Articles