టీమిండియా స్పీన్ విజయాలపై మాజీ సంచలన వ్యాఖ్యలు Spin great Rajinder Goel slams India’s reliance on turning pitches at home

Spin great rajinder goel slams india s reliance on turning pitches at home

India vs England, england, Rajinder Goel, india, spinners,, ind vs eng, eng vs ind, england vs india, England tour of India, England cricket, India cricket, cricket, cricket news, sports, sports news

Rajinder Goel, the country’s former bowling stalwart, has slammed India’s success on what he believes are underprepared pitches.

టీమిండియా విజయాలపై స్పీన్ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు

Posted: 11/03/2016 09:36 PM IST
Spin great rajinder goel slams india s reliance on turning pitches at home

ఇటీవల భారత జట్టు సాధించిన విజయాలకు వ్యూహాత్మకంగా తయారు చేసిన పిచ్లే కారణమని స్పిన్ గ్రేట్ రాజీందర్ గోయల్ విమర్శించాడు.  మన విజయాల్లో స్పిన్నర్ల ప్రత్యక్ష పాత్ర ఉందని అని తాను అనుకోవడం లేదని గోయల్ ధ్వజమెత్తాడు. 'మనకు ఏ తరహా పిచ్లపైనైనా స్పిన్ వేసే బౌలర్లు ఉన్నారనుకోవడం లేదు. స్పిన్ కు అనుకూలించే పిచ్లపైనే మాత్రమే మన బౌలర్లు ప్రతిభ చూపుతున్నారు.  ఆ రకంగా పిచ్ లు తయారు చేస్తున్నాం. స్పిన్లో అసలు మజాను ప్రేక్షకులకు అందించడంలో విఫలమవుతున్నారు. మనం స్పిన్ పిచ్లను తయారు చేయడంతోనే స్పిన్నర్లకు వికెట్లు దక్కుతున్నాయి. అదే మన సక్సెస్కు కారణం.

ఒక మంచి స్పిన్నర్ అనేవాడు మణికట్టుతో వేళ్లతో బంతిని తిప్పుతాడు. దాని గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ఎంతసేపు స్పిన్ పిచ్లను ఎలా రూపొందించాలి అనేది మాత్రమే ఆలోచిస్తున్నాం. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమేనా?, భారత్ లో మ్యాచ్లను గెలవడానికి పిచ్ లపై ఆధారపడదామా?అని గోయల్ మండిపడ్డాడు. త్వరలో ఇంగ్లండ్తో సిరీస్కు భారత జట్టు సన్నద్ధమవుతున్న సమయంలో గోయల్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. భారత జట్టు ప్రధాన స్పిన్నర్లు రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు మరో బిగ్ ఫైట్కు సిద్ధమవుతున్న వేళ ..అసలు మన స్పిన్ బౌలింగ్లో నాణ్యత లేదంటూ వ్యాఖ్యానించడంతో ఇబ్బందికరంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  england  Rajinder Goel  india  spinners  cricket  

Other Articles