2వ అంతస్థు నుంచి దంపతులను తోసేసిన అక్క, Couple pushed from second floor by sister

Couple pushed from second floor by sister 1 dead

IDH Colony, Couple pushed, sister and relatives, Bansilalpet, Gandhinagar, Telangana, crime news

A woman was killed and her husband sustained critical injuries after they were pushed down from the second floor of a building by their relatives following a property dispute

ఆస్తి పిపాసులు: 2వ అంతస్థు నుంచి దంపతులను తోసేసిన అక్క

Posted: 11/08/2016 11:35 AM IST
Couple pushed from second floor by sister 1 dead

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక.. ఏ దారి ఎటు పోతుందో ఎవరినీ అడుగక అంటూ తెలుగు గీత రచయితలు ఎప్పుడో బంధాలు, అనుబంధాలను అనేవి పెరుగుతున్న నగరీకత నేపథ్యంలో కేవలం అస్తులు చుట్టూ.. అంతస్థుల చుట్టూ తిరిగేవే తప్ప.. అప్యాయతలు, అనురాగాలను పెనవేసుకునేవి కాదని వివరించారు. అయితే ఏదో ఒక్కటి రెండు శాతం మంది మాత్రమే ఈ తరహాలో వున్నారని, మిగతా వారందరూ తమ స్తాయిలో తాము బంధాలకు ప్రాముఖ్యతను ఇస్తున్నారన్న వాదనలు కూడా తెరపైకి రాకపోలేదు.

ఈ క్రమంలో అస్తి కోసం అన్నదమ్ముల మధ్య వివాదాలు రాజుకున్న ఘటనలు అనేకం చూసిన నగరవాసులకు.. అస్తి వివాదంలో తమ్ముడిని, అతని బార్యను చంపేందుకు కూడా వెనుకాడని ఓ అక్క ఘటన షాక్ కు గురిచేసింది. ఈ ఘటనలో మరదలు ప్రాణాలు కోల్పోగా, తమ్ముడు మాత్రం జీవన్మరణాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సికింద్రాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐడీహెచ్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

నివరాల్లోకి వెళ్తే ఓ డబుల్ బెడ్‌రూం ఇంటిలో భార్యభర్తలైన చందు, జయశ్రీలు నివసిస్తున్నారు. వీరికి మాధురి, సుదీప్ పిల్లలు. ఉమ్మడి ఆస్తి అయిన డబుల్ బెడ్‌రూం ఇంటి కోసం చందు, తన సోదరి మీరాబాయిల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మీరాబాయి తన కుటుంబసభ్యులతో కలసి చందు ఇంటికి వచ్చిం డబుల్ బెడ్ రూం విషయంలో తమ్ముడితో గొడవ పడింది. అది కాస్తా తారాస్థాయికి చేరుకుంది.

దీంతో ఆవేశం పట్టలేని మీరాబాయి కుమారుడు చింటు, కుమార్తె కీర్తి, అమె భర్త బబ్లూ కలసి చందు, జయశ్రీలను బలవంతంగా రెండో అంతస్తు నుంచి కిందికి తోసేశారు. పెద్దశబ్దం వినిపించడంతో కాలనీవాసులు వెళ్లి చూడగా తీవ్రగాయాలతో చందు, జయశ్రీ కిందపడి ఉన్నారు. గాయపడిన వారిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జయశ్రీ మృతిచెందగా, చందు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IDH Colony  Couple pushed  sister and relatives  Bansilalpet  Gandhinagar  Telangana  crime news  

Other Articles