ఆ విషయంలో జగన్ వైఎస్ ని మించిపోయాడు | Minister kamineni fire on YS Jagan.

Minister kamineni fire on ycp leader karunakar reddy

AP Minister Kamineni YS Jagan, Kamineni fire on YS Jagan, YS Jagan And Bhumana Karunakar Reddy, Kamineni Srinivas fire on YS Jagan, Kamineni on Bhumana Karunakar Reddy, Health Minister Kamineni Srinivas

AP minister YS Jagan fire on YSRCP head Jagan and bhumana karunakar reddy.

జగన్ స్వయం కృషి గురించి కామినేని కామెంట్

Posted: 11/08/2016 02:46 PM IST
Minister kamineni fire on ycp leader karunakar reddy

బాధ్యత గల ఓ ప్రతిపక్ష నేత అయి ఉండి ఏం మాట్లాడాలో తెలీని స్టేజీలో వైఎస్ జగన్ ఉన్నాడంటూ బీజేపీ నేత, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ అంటున్నాడు. కేవలం విమర్శించడమే పనిగా పెట్టుకుని రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాడంటూ ఆయన ఫైరయ్యాడు. హోదా కన్నా ఎక్కువ ప్రతిఫలాలను అందించేందుకు కేంద్రం ముందుకు వస్తుంటే, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదంటూ మంగళవారం కడపలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కామినేని వ్యాఖ్యానించాడు.

ప్రపంచమంతా జేజేలు పలుకుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డికి సంస్కారం ఉందా? అని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ‌తంలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి హిందూ మతంపై విశ్వాసం లేని కరుణాకర్‌రెడ్డికి ఛైర్మన్‌ పదవి ఇచ్చార‌ని ఆయ‌న అన్నారు. టీటీడీ ఛైర్మన్‌ పదవిలో అక్రమాలకు పాల్పడ్డార‌ని ఆయ‌న ఆరోపించారు. ఇక కేంద్ర మంత్రివెంకయ్య నాయుడిపై కూడా అసభ్యపదజాలంతో కరుణాకర్ మాట్లాడటాన్ని కామినేని తీవ్రంగా తప్పుబట్టారు.

 

ఇక మ‌రోవైపు వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై కూడా కామినేని మండిప‌డ్డారు. ఇటీవ‌ల విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించిన స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులు లేవని ప‌లు వ్యాఖ్య‌లు చేశార‌ని, ఆయ‌న వాస్తవ పరిస్థితులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నార‌ని అన్నారు. 'జ‌గన్‌కు మంచి కనబడదు, వినబడ‌దు' అని కామినేని వ్యాఖ్యానించారు. గ‌తంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న జ‌గ‌న్ ఇప్పుడు సొంతంగా దోచుకోవడానికి య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఇప్పటికైనా జ‌గ‌న్‌ బుద్ధి మార్చుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP Health Minister  Kamineni Srinivas  YS Jagan  Bhumana Karunakar Reddy  

Other Articles