టాటా కి టెంపరరీ చైర్మన్ ఈయనే | Ishaat Hussain to replace Mistry as chairman of TCS

Ishaat hussain to replace mistry as chairman of tcs

TATA Board member Ishaat Hussain, TCS new chairman, TATA Mistry, Mistry as chairman of TCS, TATA consultancy, TATA board meeting, Ishaat Hussain, TCS temporary chairman

Board member Ishaat Hussain replaces Cyrus Mistry as TCS chairman.

టీసీఎస్ కొత్త చైర్మన్ ఇషాత్ హుస్సేన్

Posted: 11/10/2016 12:19 PM IST
Ishaat hussain to replace mistry as chairman of tcs

పారిశ్రామిక దిగ్గజం టాటా సంస్థలో నెలకొన్న ప్రతిష్టంభనకు ఓ ముగింపు పడే దిశగా అడుగులు పడుతున్నాయి. సైరస్ మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్ గా తొలగించిన తర్వాత, ఆ పదవికి ఇంకో వ్యక్తిని నియమించేందుకు నాలుగు నెలల స్వీయ గడువు విధించుకున్న సంస్థ, అనుబంధ కంపెనీల్లో మాత్రం సైరస్ స్థానంలో కొత్త వ్యక్తులను నియమిస్తోంది. ఐటీ దిగ్గజం టీసీఎస్ నూతన చైర్మన్ గా ఇషాత్ హుస్సేన్ ను నియమిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం టాటా సన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

కీలకమైన టాటా కెమికల్స్ బోర్డు మీటింగ్ మరికాసేపట్లో జరగనున్న క్రమంలో కొద్దిగంటల ముందే ఈ నిర్ణయం వెల్లడించారు. టాటా కన్సల్ టెన్సీ(టీసీఎస్) లో 74 శాతం వాటా ఉన్న టాటా సన్స్ ఈ నియామకం ఏకగ్రీవంగా చేసింది. ఇషాత్ వెంటనే పదవీ బాధ్యతలు చేపట్టనున్నారని స్పష్టం చేసింది.

ఇషాత్ నాయకత్వంలో సంస్థ మరింత ఉన్నతికి వెళుతుందని తాను నమ్ముతున్నట్టు ఈ సందర్భంగా రతన్ టాటా వ్యాఖ్యానించారు. గురువారం నుంచి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు బాంబే స్టాక్ ఎక్చేంజ్ కు టీసీఎస్ ఓ లేఖలో వెల్లడించింది. టాటాకు అత్యంత సన్నిహితుడైన శివశంకరన్ 700 కోట్ల వ్యవహారంతో సైరస్ మిస్త్రీ పదవి కోల్పోయిన విషయం తెలిసిందే.

కాగా, 1947 సెప్టెంబర్ 2 న జన్మించిన ఇషాత్ ఢిల్లీ సెయిట్ స్టీఫెన్స్ లో ఎకనామిక్స్ లో గ్రాడ్యేయేషన్ పట్టా పుచ్చుకున్నాడు. ఇంగ్లాండ్, వేల్స్ లో పలు ప్రముఖ కంపెనీలకు చార్టెట్ అకౌంటెంట్ గా విధులు నిర్వర్తించారు. 1999 జూలైలో టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన తర్వాత టాటా ఇండస్ట్రీస్, టాటా స్టీల్ అండ్ వోల్టాస్ డైరక్టర్ గా, అంతేకాదు వోల్టాస్ మరియు టాటా స్కైలకు చైర్మన్ గా విధులు నిర్వర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ishaat Hussain  TCS new chairman  

Other Articles