తిరిగి వచ్చేస్తాం కంగారు పడకండీ.. ఇలా చెబుతున్నదెవరూ..? Rs 1000 note to return with more security features, new colour

Rs 1000 note to return with more security features new colour

Rs500 Notes, Rs1000 Notes, Rs 2000 Notes, demonitisation of notes, new 1000 notes, shaktikanta das, economic affairs secretary, GPS nano chip, Rs 500, 1, 000 notes banned, pakistan, isi, terrorists, black money, new currency, baba ramdev, PM Modi, surgical strike on black money, swachh currency, baba ramdev shocking relavations, Rs 10,000 currency note

Rs 1000 note has not been discontinued. It will return with enhanced security features and a different colour in a few months, the government said

తిరిగి వచ్చేస్తాం కంగారు పడకండీ.. ఇలా చెబుతున్నదెవరూ..?

Posted: 11/10/2016 01:40 PM IST
Rs 1000 note to return with more security features new colour

దేశంలో నకిలీ కరెన్సీ, అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించేందకు సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్న కేంద్ర సర్కార్.. వెయ్యి రూపాయల నోట్లను, ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేసింది. ఈ మేరకు భారత ప్రధాని స్వయంగా ఈ ప్రకటనను వెలువరిస్తూ.. దేశ ఉజ్వల భవితవ్వం కోసమే తాము ఈ నీర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీంతో గత రెండు రోజులుగా దేశ ప్రజల్లో పెద్ద ఎత్తు అందోళన రేకెత్తినా.. అది కాస్తా ఇవాళ.. సరికొత్తగా రూపుదిద్దుకున్న రెండు వేల రూపాయల నోటును చూడగానే ఆ సంబరంలో కొట్టుకుపోయింది.

ఇప్పటికే దేశంలోని పలు నగరాలు, పట్టణాలలో రెండు వేల రూపాయల కరెన్సీ నోట్లను అనేక మంది పొందారు కూడా. ఇక ఈ సరికొత్త నోట్లతో సెల్పీలు కూడా దిగి.. వాటిని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తున్నారు. కాగా 500 రూపాయల నోటును మాత్రం ఇంకా బ్యాంకులు విడుదల చేయడం లేదు. మరో రెండు మూడు రోజుల వ్యవధిలో వాటిని కూడా బ్యాంకుల చెలామణిలోకి తీసుకురానున్నాయి.

ఈ సమయంలో కంగారు పడకండీ.. త్వరగానే తిరిగి వస్తామని దేశ ప్రజలకు చెబుతున్నదెవరో తెలుసా..? వెయ్యి రూపాయల కరెన్సీ నోటు. ఔనండీ.. త్వరలోనే వెయ్యి రూపాయల కరెన్సీ నోటు కూడా సరికోత్తగా చెలామణిలోకి వస్తుంది. అయితే కొత్తగా రంగులద్దుకుని.. సరికొత్త డిజైన్ తో రెట్టింపు భద్రతా ప్రమాణాలతో నకిలీ చేయడానికి వీలులేకుండా రూపుదిద్దుకుని త్వరలోనే మళ్లీ దేశ ప్రజల జేబుల్లో అలరాడనుంది.

ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతోపాటు ఎకనమిక్ ఎడిటర్స్ సదస్సులో పాల్గొన్న ఆయన.. ఈ కొత్త విషయం వెల్లడించారు. దాంతోపాటు, ఇప్పటికే చలామణిలో ఉన్న అన్ని నోట్లూ మళ్లీ కొత్త డిజైన్లతో వస్తాయని కూడా తెలిపారు. ఇప్పుడు చలామణిలో ఉన్న 100, 50, 20, 10, 5, 2, 1 నోట్లు అన్నీ కూడా యథాతథంగా చెల్లుబాటు అవుతాయని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles