సల్మాన్ ని అలా ఎలా వదిలేశారన్న సుప్రీం... | Salman Khan Issued Supreme Court Notice On Acquittal

Supreme court issues notice to salman khan in poaching case

Salman Khan, Salman Khan Chinkara poaching case, Chinkara poaching case, Salman Blackbuck case, Supreme Court Salman Khan, Notices Salman Khan

Salman Khan's troubles regarding the 1998 Chinkara poaching case continue. In a fresh turn of events, the Supreme Court has issued a notice.

సల్మాన్ కి మళ్లీ చుక్కలు?

Posted: 11/11/2016 02:53 PM IST
Supreme court issues notice to salman khan in poaching case

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు మరో సారి కృష్ణ జింక వేట కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో సల్మాన్ ను రాజస్థాన్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హైకోర్టు తీర్పును రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

ఈ కేసును విచారించిన రాజస్థాన్ హైకోర్టు... జింకల కళేబరాల నుంచి తీసిన బుల్లెట్లు సల్మాన్ తుపాకీ నుంచి పేల్చినవి కాదని భావించి, ఈ ఏడాది జులై 25న ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. దీంతో, చట్టంలోని లోపాలతోనే సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యాడని... హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరుతూ, ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం గడప తొక్కింది. ఈ క్రమంలోనే, సల్మాన్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

1998లో ఓ సినిమా షూటింగ్ సమయంలో రెండు జంతువులను సల్మాన్ చంపినట్టు కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి 2007లో, ఓ కేసులో ఏడాది, మరో కేసులో ఐదేళ్ల జైలు శిక్షను కింది కోర్టు విధించింది. దీంతో, ఓ వారం పాటు జోధ్ పూర్ కోర్టులో కూడా సల్మాన్ గడిపాడు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Black Buck case  Supreme Court  Notice  

Other Articles