అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికలలో గెలిచిన రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టకుండానే చైనాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనాపై తన ఎన్నికల ప్రచారం కారాలు మిరియాలు నూరిన ట్రంప్ ఎన్నికలు ముగిసిన తరువాత కూడా చైనా పట్ల వ్యతిరేకతను ఏమాత్రం దాచుకోకుండా బయట పెట్టాడు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికలలో గెలుపోందిన తరువాత తాను చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్‌తో మాట్లాడలేది ట్రంప్ చెప్పారు. జిన్ పింగ్‌తో మాట్లాడినట్టు మీడియాలో వచ్చిన కథనాలను తోసిపుచ్చారు.
ట్రంప్ విజయం సాధించాక చైనా అధ్యక్షుడు ఫోన్ చేసి ఆయన్ను అభినందించినట్టు చైనా సెంట్రల్ టీవీ వెల్లడించింది. ట్రంప్‌కు ఫోన్ చేసి అభినందించానని, ఇరు దేశాలు కలసి పనిచేయాల్సిన అవసరముందని చెప్పానని జిన్ పింగ్ తెలిపారంటూ ఆ టీవీ ఓ కథనం ప్రసారం చేసింది. చైనా-అమెరికా సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, అభివృద్ధి దిశగా దీర్ఘకాలిక, స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని ట్రంప్‌తో జిన్ పింగ్ చెప్పినట్టు వెల్లడించింది.
అలాగే ఇరు దేశాల మధ్య విభేదాలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారని చైనా సెంట్రల్ టీవీ పేర్కొంది. కాగా వాల్ స్ట్రీట్ జర్నల్‌తో ట్రంప్ మాట్లాడుతూ.. చైనా అధ్యక్షుడితో తప్ప చాలా మంది ప్రపంచ నేతలతో మాట్లాడానని, అభినందనలు అందుకున్నానని చెప్పారు. ట్రంప్ ప్రతినిధి హోప్ హిక్స్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఎన్నికలకు ముందు ఓ ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. చైనా అమెరికా ఉద్యోగాలను దోచుకుంటోందని, తమ దేశాన్ని అత్యాచారం చేస్తోందని, ఇకమీదట సాగబోదని తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా, చైనా సంబంధాలు ఎలా ఉండబోతాయన్నది ఇతర దేశాలు గమినిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more