భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు! | New Zealand hits with mass earthquake.

Extremely powerful earthquake rocks new zealand

New Zealand, New Zealand News, New Zealand Earthquake, Earthquake, New Zealand Tsunami, Tsunami 2016, New Zealand 2016, New Zealand Earthquake 2016, New Zealand 2016 Tsunami

Powerful Earthquake Near New Zealand Triggers Tsunami.

భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

Posted: 11/14/2016 07:21 AM IST
Extremely powerful earthquake rocks new zealand

న్యూజిలాండ్‌ని భారీ భూకంపం వ‌ణికించింది. ఆదివారం అర్థరాత్రి దాటాక(వాళ్లకి సోమవారం రాత్రి) ఈశాన్య క్రిస్ట్ చర్చ్ ప్రాంతం నుంచి ఈ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. రిక్ట‌ర్ స్కేలుపై దీని తీవ్ర‌త‌ 7.4 గా న‌మోద‌యింది. క్రైస్ట్ చ‌ర్చ్ కి 91 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు తెలిసింది.

అయితే ప్రకంపనలు వచ్చిన కాసేపటికే అధికారులు సునామీ జారీ చేశారు. భూమి పోరల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉందని, ఆ తీవ్రత సముద్రతీరం దిశగా ప్రయాణిస్తోందని వారు చెబుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన రక్షణ సిబ్బంది తీరప్రాంతాల ప్రజలను వెంటనే అక్క‌డి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

కాగా, 2011లో ఇదే ప్రాంతంలో త‌లెత్తిన భూకంపం క‌న్నా ఇది ఎంతో శక్తిమంతమైన‌ద‌ని పేర్కొన్నారు. ఇద్దరు చనిపోయినట్లు మీడియా చెబుతున్నప్పటికీ, అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : New Zealand  Earthquake  Tsunami Warning  

Other Articles