అఖిల్ ఎంగేజ్ మెంట్ కేసీఆర్ కు ఆహ్వానం | Nagarjuna invites KCR for Akhil's engagement.

Nagarjuna dattatreya and sania meet kcr

Akkineni Nagarjuna, Union Minister Bandari Dattatreya, Sania Mirza, Telangana CM KCR, Kalvakuntla Chandrashekar Rao, KCR 2016, Kalvakuntla Chandrashekar Rao 2016, Nag KCR, Nagarjuna KCR, Dattatreya Daughter's wedding, Dattatreya Daughter, Dattatreya KCR, Sania Mirza sister, Sania Mirza KCR, Sania Mirza sister's wedding

Nagarjuna Dattatreya and Sania Mirza meets Telangana CM KCR for invite marriages of their family members.

కేసీఆర్ ను కలిసిన నాగ్, సానియా, దత్తాత్రేయ

Posted: 11/15/2016 07:37 AM IST
Nagarjuna dattatreya and sania meet kcr

సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయానికి ప్రముఖుల తాకిడి ఎక్కవైపోయింది. పెళ్లిళ్ల సీజన్, పైగా మంచి ముహుర్తాలు ఉండటంతో ఆయనకు ఆహ్వానాలు అందాయి. కేంద్ర మంత్రి దత్తాత్రేయతోపాటు టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వారిలో ఉన్నారు.

నాగార్జున తనయుుడు అఖిల్‌ వివాహ నిశ్చితార్థ వేడుకకు ముహూర్తం ద‌గ్గ‌ర‌ప‌డింది. ఆ వేడుక‌కు ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించే ప‌నిలో నాగార్జున బిజీబిజీగా ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రియా భూపాల్‌తో అఖిల్‌కు వ‌చ్చేనెల‌ 9న నిశ్చితార్థం జరగనున్నట్లు తెలిసిందే. ఈ వేడుక‌కు రావాల్సిందిగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను నాగార్జున ఆహ్వానించారు.

ఇదే స‌మ‌యంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ కూడా కేసీఆర్‌ను క‌ల‌వ‌డం విశేషం. ద‌త్తాత్రేయ‌ తన కుమార్తె వివాహ వేడుకకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌, ద‌త్తాత్రేయ‌, నాగార్జున ముగ్గురు క‌లిసి కాసేపు మాట్లాడుకున్నారు. అంతకు ముందు హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా కేసీఆర్ ను కలిసి తన సోదరి వివాహానికి రావాలంటూ ఆహ్వానం అందించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Nagarjuna  Dattatreya  Sania Mirza  Telangana CM KCR  

Other Articles