క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి విపరీతానర్థాలకు దారితీస్తుంటాయి. అలాంటి సమయంలో ఓపిక వహించాలే కానీ, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక్కడ చిన్న పొరపచ్చుతో ఓ ప్రేమికుడు తీసుకున్న నిర్ణయం అతని ప్రాణాలనే అనంతవాయువుల్లో కలిపేసింది. ఓ సిమ్కార్డ్ విషయమై జంట మధ్య చెలరేగిన గొడవ ప్రేమికుడి ప్రాణం తీసింది.
వరంగల్ అర్బన్ జిల్లా నారాయణగిరికి చెందిన కల్పనకు మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన ఇందర్సింగ్కు ఫేస్ బుక్ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారితీసింది. డిగ్రీ పూర్తి చేసిన ఇందర్సింగ్కు గత జనవరిలోనే కల్పనతో పరిచయమైంది. ఇద్దరు తరచూ వరంగల్ లోనే కలుసుకునేవారు. రెండు రోజుల క్రితం పద్మాక్షీ గుండం దగ్గర మెట్లపై కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో సిమ్ ఎందుకు మారుస్తున్నావంటూ కల్పనతో ఇందర్ గొడవకు దిగాడు.
ఆమె సిమ్ కార్డును లాక్కోని నీటిలో పడేస్తానంటూ బెదిరించి, ఆ ప్రయత్నంలో నీళ్లలో పడిపోయాడు. ఇత రాకపోవటంతో ప్రాణాల కోసం కొట్టుకుండగా, ప్రేయసి సాయం కోసం అరిచిన చుట్టుపక్కల ఎవరూ లేకపోవటంతో అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more