ఎస్బీఐ బ్యాంకుకు ఝలక్ ఇచ్చిన సఫాయి కార్మికుడు Maharashtra 'safai' worker asks SBI to waive off loan 'like Mallya's'

Maharashtra safai worker asks sbi to waive off loan like mallya s

vijay mallaya, sbi loan waive off report, bhavurao sonawane,Maharashtra, safai worker, SBI, waiver off loan, Vijay Mallya,India, Maharashtra, financial and business service, banking, human interest, people, India, human interest, reserve bank of india, state bank of india, bad debts

Amid the controversy over public sector lender SBI reportedly writing off loans worth Rs 7,000 crore, a sanitation worker in Nashik has written to the SBI, seeking a ‘similar’ waiver of his Rs 1.5 lakh loan.

ఎస్బీఐ బ్యాంకుకు ఝలక్ ఇచ్చిన సఫాయి కార్మికుడు

Posted: 11/20/2016 03:46 PM IST
Maharashtra safai worker asks sbi to waive off loan like mallya s

భారతీయ స్టేట్ బ్యాంకు(స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా)కు ఓ సఫాయ్ వాలా దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చాడు. ఓ వైపు పెద్ద నోట్లను రద్దు చేయడంతో దేశ ప్రజలందరూ ఇబ్బందులను ఎదుర్కోంటున్న తరుణంలో.. మరో వైపు బ్యాంకులు బడాబాబులు తీసుకున్న రుణాలను మాఫీ చేసారన్న వార్తతో నోట్ల రద్దు విషయాన్ని సమర్థించిన వారు కూడా ఇప్పుడు విషయం తెలిసి ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. సామాన్యులను రూ.7వేల కోట్ల మొండి బకాయిలను ఎస్బీఐ రద్దు చేస్తున్నట్లు వచ్చిన రిపోర్టులపై ఓ సఫాయ్ వాలా ఝలక్ ఇచ్చాడు.

బాడాబుబుల రుణాలను మాఫీ చేసినట్లుగానే తన రుణాన్ని కూడా రద్దు చేయాలని ఎస్బీఐకు లేఖ రాశాడు. నాసిక్ త్రయంబకేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ లో భావూరావు సోనవానే సఫాయ్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. విజయ్ మాల్యాకు రుణాన్ని మాఫీ చేసిన చేత్తోనే తన రూ.1.5లక్షల రద్దు చేయాలని కోరాడు. ఈ విషయంపై మాట్లాడిన భావూరావు.. మాల్యా రుణ మాఫీ నిర్ణయంపై ఎస్బీఐకు అభినందనలు చెప్పాడు. మాల్యా రుణ మాఫీతో పాటు తన రుణాన్ని కూడా మాఫీ చేయాలని బ్యాంకును అభ్యర్ధించినట్లు తెలిపాడు.

తన కొడుకు ఆరోగ్య రీత్యా బ్యాంకు నుంచి లోను తీసుకున్నట్లు వెల్లడించాడు. తాను రాసిన లేఖపై బ్యాంకు మేనేజర్ ఇంకా సమాధానం ఇవ్వాల్సివుందని చెప్పాడు. అయితే ఇదే తరహా లేఖలు రుణగ్రహీతలందరి నుంచి బ్యాంకులకు వస్తే.. వారెలా స్పందిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. కోట్ల రూపాయల నుంచి వందలు, వేల కోట్ల వరకు రుణాల పోందిన బడాబాబుల రుణాలను ఎలా మాఫీ చేస్తారు..? తమ లక్షల రూపాయల రుణాలను ఎలా మాఫీ చేయరని సామాన్యులు న్యాయస్తానాన్ని అశ్రయిస్తే అప్పడేం చేయాలన్న విషయంలో కూడా బ్యాంకులు డోలాయమానంలో పడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles