తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది 2017 సంవత్సరానికిగానూ సెలవుల జాబితాను కాసేపటి క్రితం విడుదల చేసింది. పండుగలతో కూడిన సెలవులను 21, రెండో శనివారం, ఆదివారం వచ్చిన పండుగలు 3 రోజులు, ఐచ్ఛిక సెలవులు 15, రెండో శనివారం, ఆదివారం రోజుల్లోని ఐచ్ఛిక సెలవులు 3 లతో కలిపి మొత్తం 42 సెలవులు రానున్నాయి. ఇవేగాక మహావీర్ జయంతి, రథయాత్ర, ఈద్ - ఇ -గదీర్, క్రిస్మస్ ఈవ్ ఆదివారం వచ్చాయి. అన్ని విభాగాల్లోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ సెలవులు వర్తింపజేయనున్నారు. సమాయానుసారం అవసరమైతే చివరి నిమిషంలో ఆయా తేదీల్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం నోటీసులో స్పష్టంగా పేర్కొంది.
సాధారణ సెలవులు తేదీ వారం
బోగి 13.01.2017 శుక్రవారం
గణతంత్ర దినోత్సవం 26.01.2017 గురువారం
మహాశివరాత్రి 24.02.2017 శుక్రవారం
ఉగాది 29.03.2017 బుధవారం
శ్రీరామనవమి/బాబు జగ్జీవన్ రామ్ జయంతి 05.04.2017 బుధవారం
గుడ్ ఫ్రైడే/డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి 14.04.2017 శుక్రవారం
రంజాన్(ఈద్ ఉల్ ఫిత్ర్) 26.06.2017 సోమవారం
రంజాన్ తరువాతి రోజు 27.06.2017 మంగళవారం
బోనాలు 10.07.2017 సోమవారం
శ్రీకృష్ణాష్టమి 14.08.2017 సోమవారం
స్వాతంత్య్ర దినోత్సవం 15.08.2017 మంగళవారం
వినాయక చవితి 25.08.2017 శుక్రవారం
బక్రీద్(ఈద్ ఉల్ అజా) 02.09.2017 శనివారం
బతుకమ్మ ప్రారంభం 20.09.2017 బుధవారం
దుర్గాష్టమి 30.09.2017 శనివారం
మహాత్మాగాంధీ జయంతి 02.10.2017 సోమవారం
దీపావళి 18.10.2017 బుధవారం
కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి 04.11.2017 శనివారం
ఈద్ మిలాద్ ఉన్ నబి 01.12.2017 శుక్రవారం
క్రిస్మస్ 25.12.2017 సోమవారం
బాక్సింగ్ డే 26.12.2017 మంగళవారం
రెండో శనివారం, ఆదివారం వచ్చిన సాధారణ సెలవులు
సంక్రాంతి/పొంగల్ 14.01.2017 రెండో శనివారం
హోళి 12.03.2017 ఆదివారం
షహదత్ ఇమామ్ హుస్సేన్(ఏ.ఎస్) 10వ మొహర్రం 01.10.2017 ఆదివారం
ఐచ్ఛిక సెలవులు తేదీ వారం
యాజ్ దాహుమ్ షరీఫ్ 10.01.2017 మంగళవారం
శ్రీ పంచమి 01.02.2017 బుధవారం
హజ్రత్ అలీ జయంతి 11.04.2017 మంగళవారం
షబ్-ఎ-మీరజ్ 25.04.2017 మంగళవారం
బసవ జయంతి 28.04.2017 శుక్రవారం
బుద్ధ పూర్ణిమ 10.05.2017 బుధవారం
షబ్-ఎ-బారాత్ 12.05.2017 శుక్రవారం
షహదత్ హజ్రత్ అలీ 16.06.2017 శుక్రవారం
జుమా-అతుల్-వాడ/షబ్-ఎ-కదర్ 23.06.2017 శుక్రవారం
వరలక్ష్మి వ్రతం 04.08.2017 శుక్రవారం
శ్రావణ పౌర్ణమి/రాఖి పౌర్ణమి 07.08.2017 సోమవారం
పార్సీ నూతనసంవత్సరాది 17.08.2017 గురువారం
మహర్ణవమి 29.09.2017 శుక్రవారం
నరక చతుర్థి 17.10.2017 మంగళవారం
అర్బయీన్ 10.11.2017 శుక్రవారం
రెండో శనివారం, ఆదివారం రోజుల్లోని ఐచ్ఛిక సెలవులు
నూతన సంవత్సరాది 01.01.2017 ఆదివారం
కనుమ 15.01.2017 ఆదివారం
హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జువన్‌పురి జయంతి 11.02.2017 రెండో శనివారం
మహావీర్ జయంతి -09.04.2017 - ఆదివారం
రథయాత్ర - 25.06.2017 - ఆదివారం
ఈద్ - ఇ -గదీర్ - 10.09.2017 - ఆదివారం
క్రిస్మస్ ఈవ్ - 24.12.2017 - ఆదివారం
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more