నవంబర్ 10 2016.. దేశంలోకి ఒక కొత్త నోటు, ప్రస్తుతం దేశంలోనే అత్యంత పెద్ద విలువైన నోటు విడుదలైన రోజు. ఈ నోటు కోసం దేశంలోని అనేక మంది ప్రజలు బ్యాంకులు, ఏటీయం కేంద్రాల వద్ద క్యూ కట్టి పడిగాపులు కాస్తూ.. నోట్లను తీసుకుంటున్నారు. వీటిపై కూడా కేంద్ర ప్రభుత్వం పరిమితలు విధించి కేవలం రోజుకు ఒక్క రెండు వేల రూపాయల నోటుకు మాత్రమే ఇవ్వాలన్న నిబంధన విధించింది. లేదా రెండు వేల రూపాయల విలువైన 100 నోట్లను మాత్రమే అధికారులు ఇస్తున్నారు. వీటి కోసం ప్రజలు దేశవ్యాప్తంగా అనేక అవస్థలు పడుతున్నారన్నది కాదనలేని నిజం.
అయితే పట్టుమని పక్షం రోజులు కూడా కాకముందే.. దేశంలోకి అక్రమంగా చోరబడ్డ ఫాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల వద్ద ఈ నోట్లు వుండటం సంచలనంగా మారింది. బండిపోరాలో క్రితం రోజు రాత్రి జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన టెర్రరిస్టుల వద్దు రూ.2000వేల నోట్లు ఉండటం చర్చనీయాంశంగా మారింది. కొత్త నోట్లను విడుదల చేసి రెండు వారాలే అవుతున్నా అప్పుడే అవి టెర్రరిస్టులకు ఎలా చేరాయన్నది అర్థంకాని ప్రశ్నగా మారింది. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన ఆర్మీ వారి నుంచి రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకుంది. వీటిలో రెండు రూ.2వేల నోట్లు కాగా, మిగతావి 100నోట్లని తెలిపింది.
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్ధ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదుల వద్ద రెండు వేల రూపాయల నోట్లు వుండటం పలు ప్రశ్నలకు తావిస్తుంది. ఇంతకీ అవి ఒరిజినల్ కరెన్సీ నోట్లేనా..? లేదా..? నకిలీవా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కొత్తగా వచ్చిన రెండు వేల రూపాయల కరెన్సీ నోట్లను.. నకిలీవి ముద్రించడం పాకిస్థాన్ వల్ల జరిగే పని కాదని ఇప్పటికే ఆర్బీఐ అధికారులతో పాటు దేశ అర్థిక శాఖ ఉన్నతాధికారుల నుంచి అందరూ స్పష్టం చేసిన విషయమే.
ఈ నేపథ్యంలో అవి ఒరిజినల్ నోట్లు అయితే మనకు వచ్చిన ప్రమాదమేమి లేదు. దేశంలోని తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం మనుషులు ఉగ్రవాదులకు అండగా వున్నారని, వారికి అన్ని విధాలా సాయం చేస్తున్నారని, ఈ క్రమంలోనే వారికి కొత్తగా ముద్రించిన రెండు వేల రూపాయల నోట్లను కూడా చేరవేశారని భావించవచ్చు. అయితే అలా కాకుండా ఈ నోట్లు నకిలీవైతేనే ముప్పు వెన్నంటే వుందని అర్థం. దేశంలో నల్లధనం, అవినీతిని రూపుమాపడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలకు చెక్ పెట్టడం కోసం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన అర్థిక సంస్కరణలో భాగంగా పెద్ద నోట్ల రద్దు ఫలితంపై కూడా నీలీనీడలు అలుముకునే ప్రమాదముంది.
ఈ విషయంలో భారతీయ రిజర్వు బ్యాంకు అధికారులతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ క్లారీటీ ఇవ్వాల్సిన అవసరం వుంది. తమ డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు ప్రతి రోజు బ్యాంకుల వద్ద క్యూ కడుతూ.. ఇబ్బంధులకు గురవుతున్న ప్రజలు.. దేశ హితం కోసం కేంద్రం తీసుకున్న చర్యలను కొంత అసహనంతో స్వాగతిస్తున్నారు. కేంద్రం చెప్పినట్టు ముందరున్న మంచి రోజుల కోసం అశగా ఎదురుచూస్తున్నారు. అయితే అవి నకిలీ నోట్లని తేలితే మాత్రం కేంద్రం త్వరగా చర్యలు తీసుకుని పాకిస్తాన్ అట కట్టించాలని కూడా కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more