పెళ్లి చేసుకుంటానని రాహుల్ మాటిచ్చాడు.. Rahul Gandhi ki deewani

Woman says she loves and wants to marry rahul gandhi

rahul gandhi, marriage, woman, congress, bjp, uttar pradesh, rahul gandhi marraige, ragul gandhi wedding, rahul gandhi proposal, rahul gandhi marriage proposal, woman propose rahul gandhi, narendra modi, sonia gandhi, viral video, funny video, funny indian videos

A video was doing rounds on social media of a woman wanting to marry Congress vice-president Rahul Gandhi. she has been “charmed” by Gandhi.

ITEMVIDEOS: పెళ్లి చేసుకుంటానని రాహుల్ మాటిచ్చాడు..

Posted: 11/23/2016 05:07 PM IST
Woman says she loves and wants to marry rahul gandhi

దేశంలోని ఎంతోమంది కలల రాకుమారుడు.. అఫ్ కోర్స్ కొంత ముదిరిన బెండకాయ అని చెప్పక తప్పదు.. అయినా ఎందరెందరి కలల్లోనే విహరించి మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్ కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అని చెప్పక తప్పదు. అయితే ప్రస్తుత తరుణంలో తన పెళ్లి కన్నా ముందు పార్టీని గాడీలో పెట్టి.. మళ్లి పూర్వవైభవం కోసం పాటుపడాలని అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు. కానీ, ఇటీవల అనూహ్యంగా ఓ మహిళ ఆయనను పెళ్లి చేసుకుంటానని ప్రతీ రోజు మాట ఇస్తూన్నాడని, ఆయనను తాను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చింది. అయితే ఎవరా అప్సరస అని అలోచిస్తున్నారా..?

ఉత్తరప్రదేశ్‌ అలహాబాద్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడుతూ తన మనసులోని మాటను బయటపెట్టారు. రాహుల్‌గాంధీపై తాను మనస్సు పడ్డానని, ఆయనను ప్రేమిస్తున్నాని చెప్పారు. ‘రాహుల్‌కు నేను వీరాభిమానిని.. ఎందుకంటే ఆయన దళితుల ఇళ్లలో అన్నం తిన్నారు, దళితులకు సాయపడ్డారు, కాబట్టి ఆయన దళితురాలని పెళ్లి చేసుకోవాలి’ అని చెప్పారు. ‘నిజానికి నేను ఓబీసీ మహిళను.  చాలాకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నాను. కాబట్టి నన్నే ఆయన ఎందుకు చేసుకోకూడదు’ అని ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ అందానికి తాను ఫిదా అయ్యానని చెప్తున్న ఆమె.. తనను ఆయన ఎందుకు పెళ్లి చేసుకోవాలో వివరిస్తూ పలు బలమైన కారణాలు కూడా చెప్తోంది.
 
కాంగ్రెస్‌ సేవా దళ్‌ సభ్యురాలిగా తాను చాలాకాలంగా పనిచేస్తున్నానని, 2006లోనే రాహుల్‌ను పెళ్లాడాలని అలోచన తనకు కలిగిందని, దీంతో 2014లో తాను కాంగ్రెస్‌లో చేరానని, అప్పటినుంచి రాహుల్‌పై తన నమ్మకం మరింత పెరిగిందని చెప్పారు. రాహుల్ అందగాడు. ప్రధాని కొడుకు. మంచి నేత’ అంటూ చాంతాడంతా జాబితా బయటపెట్టారు. పెళ్లి విషయంలో రాహుల్‌ ఏమైనా హామీ ఇచ్చారా? అని అడుగగా ‘నిజజీవితంలో ఇవ్వలేదు కానీ, కలలో తరచూ వచ్చి నిన్నే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చేవారని పేర్కొంది.

అయితే పెద్దనోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పబడుతూ.. అటు పార్లమెంటు లోపలా బయటా ప్రభుత్వాని నిలదీస్తున్న పెడుతున్న రాహుల్ గాంధీని.. ఇరకాటంలో పెట్టాలన్న యోచనతో కొందరు గిట్టని వారు చేస్తున్న ప్రచారమని కాంగ్రెస్ వర్గాలు పేర్కోంటున్నాయి. రాహుల్ ప్రశ్నల ధాటికి దడిసి గిట్టని పార్టీలు చేస్తున్న అసంబద్ద ప్రకటనలకు మీడియా కూడా పబ్లిసిటీ ఇవ్వడం అంత మంచి పని కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  marriage  woman  congress  bjp  allahabad  uttar pradesh  

Other Articles