ఈ లోసుగుతో నలుపు తెలుపుగా మారదా..? scrapped notes are turning into white flying off to northeast

Scrapped notes are turning into white flying off to northeast

north eastern states, tax free haven, assam, tripura, meghalaya, sikkim, mizoram, nagaland, manipur, Currency ban,Notes Ban,Prime Minister Narendra Modi, demonetisation, parliament session, congress, rbi rules, pm modi demonetisation, demonetisation rules, atm withdrawal charges, india news

In ongoing parliament session Congress leader Anand Sharma demanded that PM Narendra Modi explain his comments alleging a threat to his life.

ఈ లోసుగుతో నలుపు తెలుపుగా మారదా..?

Posted: 11/24/2016 03:01 PM IST
Scrapped notes are turning into white flying off to northeast

అవినీతిపై పోరాటంలో భాగంగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తమ వారికి ముందుగానే లీకులిచ్చారని ఇప్పటికే పలు విమర్శలు, అరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మరో వివాదం కూడా కేంద్రం మెడకు చుట్టుకునేలా వుంది. నోట్ల రద్దు వ్యవహారంపై ఈ నెల 8న ప్రధాని ప్రకటన చేసిన తరువాత నుంచి అనేక పర్యాయాలు ప్రజలకు అందోళన చెందవద్దని, నోట్లు కావాల్సనన్ని వున్నాయని పేర్కోంటూ మీడియా ముఖంగా పలు సూచనలు, అదేశాలు జారీ చేసిన అధికారి.. అర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్.. సహా ఇతర అధికారులు కానీ, కేంద్రమంత్రులు కానీ ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోవడం కూడా అరోపణలకు బలం చేకూర్చుతుంది.

విషయంలోకి ఎంటరైతే.. దేశవ్యాప్తంగా లేని పలు రాయితీలు, పన్నుల మినహాయింపులు ఈశాన్యా రాష్ట్రాలల్లోని పలు ప్రాంతాలకు వున్నాయి. దీంతో ఉత్తరభారతానికి చెందని పలు రాష్ట్రాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకుపెద్ద ఎత్తున తరలుతున్న నోట్లు తరలుతున్నాయి. రద్దు చేయబడిన నోట్లను అక్కడికే ఎందుకు తరలుతున్నాయనడానికి కారణం అదే. మరీ ముఖ్యంగా బీజేపి పాలిత హర్యానా రాష్ట్రం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు పెద్ద ఎత్తున రద్దైన నోట్లు ఎందుకు వెళ్తున్నాయి.

ఈశాన్య రాష్ట్రాలలో వున్న వెసలుబాటుతో తమ వద్ద వున్న నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకునే ప్రయత్నంలోనే నవంబర్ 9 నుంచి ఇప్టి వరకు కొటానుకోట్ల రూపాయల నల్లధనం అక్కడికి తరలిపోయింది. దీంతో తమ వద్దనున్న నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చుకోవడానికి నల్లకుబేరులు అల్లుతున్న సరికొత్త ప్లాన్ ఇది. అదాయ పన్నుశాఖ వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలకు పన్ను చెల్లింపుల్లో ఇచ్చిన కొన్ని సడలింపులను తమకు అనుకూలంగా మార్చకుంటున్నారు నల్లధన కుబేరులు.
 
ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలలో నివాసం ఉండే ఎస్టీలకు ఐటీ శాఖ పన్ను నుంచి కొంత మినహాయింపును ఇచ్చింది. అస్సాంలోని ఉత్తర కఛర్ హిల్స్, మికిర్ హిల్స్, మేఘాలయలోని ఖాసి హిల్స్, గరో హిల్స్, జైన్ టియా హిల్స్, జమ్మూ,కశ్మీర్ లోని లడఖ్, సిక్కీం రాష్ట్ర ప్రజలకు పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉంది. ఈ ప్రాంతాల్లో జరిగే లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

అయితే, అధిక విలువ కలిగిన నోట్ల రద్దు వల్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు నల్లకుబేరులు ఈ రాష్ట్రాలు సులువైన మార్గంగా ఎన్నుకుంటున్నారు. వ్యవసాయ భూములు, చారిటబుల్ ట్రస్టులు, ఖాదీ పరిశ్రమలు, గ్రామస్ధాయి పరిశ్రమలు, లాభాపేక్ష లేని విద్యాసంస్ధలు, లాభాపేక్ష లేని ఆసుపత్రులు, రాజకీయ పార్టీలకు ఐటీ యాక్ట్ లో పూర్తి పన్ను మినహాయింపు ఉంది. దీంతో పెద్ద మొత్తంలో నల్లధనాన్ని ఇతర రాష్ట్రాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు తరలిస్తూ తెల్లధనంగా మార్చుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles