బాంబులు పేల్చారని అలిగి వెళ్లిపోయిందా? | Tigress breaks free from enclosure in Indore zoo.

In indore zoo tigress breaks free from enclosure

Tigress escape, Tigress leaps, Madhya Pradesh Zoo, stampede in Indore Zoo, Tiger Jamuna, Jamuna escaped from Zoo

Tigress leaps out of cage in Madhya Pradesh, many hurt in stampede.

జమున అసలు ఎక్కడికి వెళ్లిపోయింది?

Posted: 11/28/2016 11:40 AM IST
In indore zoo tigress breaks free from enclosure

అది ఇండోర్ లోని కమలా నెహ్రూ జంతు ప్రదర్శన శాల. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయం. సెలవు రోజు కావటంతో రద్దీ విపరీతంగా ఉంది. వందల సంఖ్యలో జనాలు అటు ఇటు తిరుగుతూ కుటుంబాలతో సంతోషంగా గడుపుతున్నారు. ఇంతలో అలజడి...

పెద్దపులి కనిపించటం లేదని. అంతే భీతిల్లి పోయిన జనాలు దౌడు తీయటం ప్రారంభించారు. ఈ క్రమంలో పెద్ద తొక్కిసలాట జరిగి చాలా మందికి గాయాలయ్యాయి. చివరికి ఓ గంట తర్వాత పరిస్థితిని అదుపులోకి తెచ్చిన జూ సిబ్బంది తాపీగా పులిని వెతకటం ప్రారంభించారు. అయితే చీకటి కావటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు.

జమునా అనే ఓ ఆడపులి సందర్శకుల కోసం బోను నుంచి బయటికి రప్పించారు సిబ్బంది. అదే సమయంలో అక్కడ సమీపంలో ఓ పెళ్లి బృందం విపరీతంగా పాటలుపెట్టడం, బాణాసంచా పేల్చటం చేయటంతో చికాకులోనైన పులి బయటికి దూకెసిందంట. అయితే ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నదేంటంటే.. హైనాలు ఉంచాల్సిన బోనులో పులులను ఉంచాలని, ఆ పులిని చూసిన పిల్లలు రాళ్లు వేస్తున్నా సిబ్బంది అడ్డుచెప్పలేదని, దానికి చిర్రెత్తుకొచ్చి కంచెలోంచి బయటికి వచ్చేసిందని తెలిపారు. ఓ పెద్ద పులి మమల్ని గుర్రుగా చూస్తూ సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోయిందంటూ ఓ జంట వివరిచింది.

తెల్లవారగానే ఈ పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించారు. కాగా, జూ ను దాటి పులి బయటికి వెళ్లే సీన్ అస్సలు లేదని చెబుతున్న అధికారులు, చాలా మంది ప్రజలు చుట్టుపక్కల ఉన్నా, ఇంతవరకు ఎవరిపై దాడి చేయలేదని అధికారులు లోపాలను కప్పిపుంచుకుంటున్నారు.

కాగా, ఉత్తరాఖండ్ లో ఓ చిరుత జనావాసాల్లోకి వచ్చి నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేయగా, గ్రామస్థులంతా కలిసి దానిని సుత్తులతో, కర్రలతో బాది కిరాతకంగా చంపిన ఘటన తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tigress Jamuna  Indore Zoo  Escape  

Other Articles