కాంగ్రెస్ మాజీ ఎంపీ, కర్ణాటక రాహుల్ గాంధీగా పేరుగాంచిన రమ్య మరో వివాదంలో చిక్కుకుంది. మండ్య పర్యటనలో భాగంగా ఓ యువకుడిని దుర్భాషలాడిందంటూ పెద్ద గొడవే జరిగింది. రమ్య ప్రవర్తన చూసి చిర్రెత్తుకుపోయిన స్థానికులు కూడా ఆ యువకుడికే మద్ధతుగా నిలవటంతో చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
గతంలో మండ్య ఎంపీగా ఉన్న సమయంలో రమ్య 'వన్ ఇండియా.. వన్ ఎంపీ' అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ప్రజల సమస్యలు, వాటికి సరైన పరిష్కార మార్గాలపై థీసిస్ సమర్పించిన వారికి రరూ.2.5 లక్షల బహుమానం ఇవ్వనున్నట్టు ప్రకటించింది కూడా. దీంతో జిల్లా వ్యాప్తంగా 117 మంది యువకులు తమ థీసిస్‌ను ఎంపీకి పంపారు. అయితే ఎంపీగా తన పదవీ కాలం ముగిసిన తర్వాత రమ్య ఆ విషయాన్ని లైట్ తీసుకుంది.
సోమవారం రమ్య కలెక్టర్ కార్యాలయానికి వస్తున్నట్టు తెలుసుకున్న థీసిస్ పంపిన వారిలో ఒకరైన చిక్కమరళి గ్రామానికి చెందిన పాండుదుదై అనే యువకుడు అక్కడికి వెళ్లాడు. రమ్య రాగానే వన్ ఇండియా కార్యక్రమంపై మాజీ ఎంపీని నిలదీశాడు. దీంతో స్పందించిన రమ్య.. తాను ఇప్పుడు ఎంపీని కాదని, ఆ విషయాన్ని ప్రస్తుత ఎంపీ వద్ద తేల్చుకోవాలంటూ సూచించింది. బహుమతి ఇవ్వకపోయినా పర్లేదు కానీ కనీసం థీసిస్ పంపిన వారిని అభినందించాలని అతను కోరాడు.
అంతే సహనం కోల్పోయిన రమ్య నువ్వు రౌడీలా మాట్లాడుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే కలగజేసుకున్న రమ్య మద్దతుదారులు యువకుడిపై దాడికి దిగారు. స్థానికులు పాండుదురైని రక్షించి రమ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు , పోలీసులు కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more