ఓవైపు పెద్దనోట్ల రద్దు వ్యవహారం పూర్తిగా రాజకీయాంశంగా మారిపోయింది. దీనిని ఆసరాగా చేసుకుని శీతాకాల సమావేశాలు జరగకుండా ప్రతిపక్షాలు పార్లమెంట్ ఉభయ సభలను అడ్డుకునేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో పెరిగిపోతున్న వ్యతిరేకతను కాస్తైనా తగ్గించేందుకు మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
పెద్ద నోట్ల రద్దు, ఆపై నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేసి ఓ సమగ్ర నివేదిక తయారు చేయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ కమిటీ ఏర్పాటు చేసింది. నగదు రహిత లావాదేవీలు, కార్డుల వినియోగం అంశాలను ప్రోత్సహించడంపై కమిటీ సమగ్రంగా పరిశీలన జరిపి కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిక ఇవ్వనుంది. మొత్తం ఆరు రాష్ట్రాల సీఎంలు ఉండే ఈ కమిటీకి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నాడు. ఈ కమిటీలో సభ్యులుగా చంద్రబాబుతో పాటు మధ్యప్రదేశ్, ఒడిశా, పుదుచ్చేరి, త్రిపుర, బీహార్ సీఎంలను నియమించారు.
ఎన్టీయే లో భాగస్వామిగా ఉండటమే కాదు, మొదటి నుంచి పెద్ద నోట్ల రద్దును చంద్రబాబు సమర్థిస్తూ వస్తున్నాడు. అంతేకాదు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా ఆర్థిక స్థితిపై కాస్త అసంతృప్తితో ఉన్నప్పటికీ, బాబు మాత్రం కాస్త ఓపిక పట్టాలంటూ ప్రజలకు ఎప్పటికప్పుడూ పిలుపు ఇస్తూనే ఉన్నాడు. మరోవైపు అసలు పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై ఎప్పటి నుంచో వీరిద్దరి మధ్య డిస్కషన్లు జరుగుతున్నాయన్న వాదన కూడా ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎంను మించి మరోకరు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేరన్న భావనకు వచ్చిన మోదీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
మరోపక్క ఈ అంశంపై సానుకూలంగా స్పందిస్తున్న నితీశ్ కుమార్ లాంటి వాళ్లను సభ్యులుగా చేర్చాలన్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరితోపాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ, ప్రస్తుత ఆందోళనకు దూరంగా ఉన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, త్రిపుర సీఎం మాణిక్ సర్కార్, మరియు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులను కూడా ఇందులో సభ్యులుగా ఆహ్వానించాలని మోదీ సర్కార్ డిసైడ్ అయ్యింది. తద్వారా ప్రతిపక్షాలపై పరోక్షంగా పై చేయి సాధించొచ్చనే ధీమాలో ఉంది.
మరోపక్క తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మోదీ తీసుకున్న నిర్ణయం తాజాగా ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను కూడా చివరి నిమిషంలో చేర్చే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆయా రాష్ట్రాల సీఎంలతో ఫోన్లో మాట్లాడినట్లు, వచ్చేనెల 2వ తేదీన ఈ కమిటీ సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more