బిహార్ అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు శృతిమించుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చుట్టూ ఎక్కు పెట్టి మిత్రపక్షాలు, ఒకనాటి మిత్రపక్షాలు చేస్తున్న విమర్శలు, ప్రతివిమర్శలు బీహార్ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. మాతో వున్న 17 ఏళ్లు స్వర్ణ యుగంలా వుందని ఇప్పడు ముఖ్యమంత్రిని చూస్తుంటే ఆయన రాజకీయ జీవితం ఏమౌతుందోనన్న అందోళన కలుగుతుందని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్ కుమార్ సానుభూతి వ్యాఖ్యల నేపథ్యంలో అతనిపై మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవీ విరుచుకుపడ్డారు.
ఈ క్రమంలో అమె మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భవిష్యత్తు గురించి అంత ఆందోళన పడుతున్న సుశీల్ ఆయనను ఇంటికి తీసుకెళ్లి ఒడిలో కూర్చొబెట్టుకోవచ్చని అన్నారు. అది కాకుంటే నితీశ్‌కు సుశీల్ సోదరి చేయినందించి పెళ్లి చేసుకోని ఆయన ఖ్యాతిని పెంచుకోవచ్చని వివాదాస్పదంగా మాట్లాడారు. అనక ఇది కేవలం సరదాగా అన్న మలాటేనని, అందరూ సరదాగా మాట్లాడుతారుగా, అందుకనే తాను సరదగా జోక్ చేశానని చెప్పారు.
రబ్రీ దేవి ఇలా స్పందించడానికి కారణం కూడా లేకపోలేదు.. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతిస్తూ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బహిరంగ ప్రకటన చేయడంతో ఆయనను వెనకేసుకోచ్చి.. ఆయన ప్రభుత్వానికి మద్దతునిస్తున్న పార్టీలను మాత్రం తూర్పారబట్టే ప్రయత్నం చేశారు సుశీల్ మోడీ. బీజేపీలో ఉన్నప్పుడు నితీశ్ కుమార్ జీవితం చాలా అద్భుతంగా ఉందని, కానీ, ఇప్పుడు ఆర్జేడీ, కాంగ్రెస్ కారణంగా ఆయన తెగ ఇబ్బందులు పడుతున్నారని సుశీల్ కుమార్ మోదీ వాపోయారు. ఆ పార్టీలతో స్నేహంపై నితీష్ కుమార్ పునరాలోచించాలని ఆయన సూచించారు.
ఈ నేపథ్యంలోనే లాలూ భార్య రబ్రీదేవిని పలువురు మీడియా ప్రతినిధులుస్పందన కోరగా సుశీల్‌కు నితీశ్ ను చూసి అంత బాధనిపిస్తే ఆయన సోదరినిచ్చి పెళ్లి చేసి ఇంటికి తీసుకెళ్లి ఒడిలో కూర్చొబెట్టుకోవచ్చని ఘాటుగా అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు మీడియాలో పలు విమర్శలకు దారి తీయడంతో తన ఉద్దేశం అది కానే కాదని, మీడియానే తన వ్యాఖ్యలను వక్రీకరించిందని చెప్పారు. సుశీల్ కుమార్ మోదీ తనకు మరిదిలాంటివాడని, అతడికి తాను వదినలాంటిదాన్నని, ఆ మాత్రం పరాచికాలు ఆడకూడదా అంటూ వివరణ ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more