కేంద్ర ప్రభుత్వం క్యాష్ లెస్ ఇండియా.. డిజిటల్ మనీ అన్న పదాలను వినిసిస్తున్న వేళ.. ఆ దిశగా తీసుకున్న భద్రతా చర్యలు ఎలా వున్నాయి.. సైబర్ సెక్యూరిటీ దేశంలో ఎలా వుంది అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇటీవల దేశానికి చెందిన ప్రముఖ బ్యాంకులకు సంబంధించిన 60 లక్షల మంది డెబిట్ కార్డుల జాబితాను పాకిస్థాన్ కు చెందిన సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన నేపథ్యంలో పలు కొత్త అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ తరుణంలో దేశంలోని సైబర్ సెక్యూరిటీని ప్రశ్నించే విధంగా ఓ మధ్యప్రదేశ్ యువతికి ఎదురైన ఘటన కూడా సవాలు విసురుతుంది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఓ 30 ఏళ్ల మహిళకు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులు వచ్చాయి. అమెకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని తాము హ్యాక్ చేసిన రాబట్టామని, వీటితో పాటు అమె నగ్న ఫోటోలు అన్నింటినీ కూడా తాము పొందామని, వీటిని యధాతథంగా వుంచాలంటే తాము కోరినట్టుగా రెండు కోట్ల రూపాయలను బిట్ కాయిన్ల రూపంలో తమకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అగంతకులు అమెకు ఈ మెయిల్ ద్వారా హెచ్చరికలు పంపారు.
తాము కోరినట్టు డబ్బును ఇవ్వని పక్షంలో అమె నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో వున్న మిత్రులతో పాటు అమె కుటుంబసభ్యులకు, స్నేహితులకు పంపుతామని హెచ్చరించారు. దీంతో పాటు ఫొటోలను వరుసపెట్టి పోర్నోగ్రాఫిక్ సైట్లలో పెడుతూనే ఉంటామని హెచ్చరించారు. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ఈమెయిల్ ఫిలిప్పీన్స్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని జబల్పూర్ ఎస్పీ ఆశిష్ తెలిపారు. ఓపెద్ద కుటుంబానికి చెందిన ఆ మహిళ.. ఈ తరహా ఈమెయిల్ రావడంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
ఆమె వ్యక్తిగత సమాచారం, నగ్న ఫొటోలు అన్నింటినీ ఆమె సోషల్ మీడియా కాంటాక్టులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చేరవేయడంతో పాటు పోర్న్ సైట్లలో కూడా పెడతామని.. ఇదంతా జరగకూడదంటే బిట్‌కాయిన్ల రూపంలో 2 కోట్లు చెల్లించాలని ఆ ఈ మెయిల్‌లో పేర్కొన్నారు. పైగా అందుకు పెద్ద సమయం కూడా ఇవ్వలేదని ఎస్పీ చెప్పారు. అయితే ఇలాంటి కేసులను విచారించడం అంత సులభంగా అయ్యే పని కాదని పోలీసలు అంగీకరించారు. నిందితులు టీఓఆర్ బ్రౌజర్లు వాడటం వల్ల వాళ్ల సెర్వర్లు ఎక్కడున్నాయో గుర్తించడం కష్టమని, అలాగే బిట్‌కాయిన్ల రూపంలో చెల్లింపు వల్ల దాన్ని ట్రేస్ చేయడం మరింత క్లిష్టమని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more