రష్యాకి మన కొత్త నోట్లు కోపం తెప్పిస్తున్నాయా? | Russia has threatened to take "counter steps".

Russia objects to notes ban

Russia India notes ban, India Russia Notes Ban, diplomatic protest Russia, Russia India New Notes, New Notes Draw Limit, Russia Embassy India, India Russia Ambassador, Alexander Kadakin

Russia has threatened to take "counter steps" and lodge a diplomatic protest over the Indian government move to ban big currency notes, which they say has hit their embassy's operations in Delhi, Russian government

కొత్త నోట్లపై రష్యా సీరియస్ వార్నింగ్

Posted: 12/06/2016 03:30 PM IST
Russia objects to notes ban

ఓవైపు పాక్, చైనాలతో సహా అన్ని దేశాలు మోదీ ప్రభుత్వం తీసుకున్న కొత్త నోట్ల నిర్ణయాన్ని స్వాగతించాయి. భారత్ ఆర్థిక వృద్ధికి నోట్ల రద్దు ఎంతగానో ఉపకరిస్తుందని కీర్తించాయి. అయితే అత్యంత సన్నిహితంగా మెలిగే రష్యా ఈ విషయంలో భారత్ కు పెద్ద షాకే ఇచ్చింది. దౌత్యపరమైన సంబంధాలను సాకుగా చూపుతూ వార్నింగులు ఇస్తోంది.

ఢిల్లీలో ఉన్న వివిధ దేశాల రాయబార కార్యాలయాలకు కూడా ఆర్థిక శాఖ కేవలం 50, 000 మాత్రమే విత్ డ్రా చేసుకోవాలన్న నిబంధనను విధించింది. అయితే కార్యాకలపాల నిర్వహణకు ఇంత తక్కువ నగదు సరిపోదన్న వాదనను రష్యా కార్యాలయం లేవనెత్తుతోంది. ఇంత పెద్ద రాయబార కార్యాలయం నగదు లేకుండా ఎలా పని చేయగలదు? అంటూ ప్రశ్నిస్తోంది. ఈ మేరకు రష్యా దేశ రాయబారి అలెగ్జాండర్ కదాకిన్ విదేశాంగ శాఖకు ఓ లేఖ రాశాడు. రెండు రోజుల్లో దీనికి సమాధానం ఇవ్వాలని కోరగా, ఇంతవరకు దానిపై స్పందన లేదు.

ఇక రష్యా ప్రభుత్వం ఇది ముమ్మాటికీ అంతర్జాతీయ హక్కులను కాలరాయటమే అని చెబుతోంది. కాగా, దీనిపై మన అధికారులు స్పందించకపోయినప్పటికీ, ఎన్నారైలు, రాయబార కార్యాలయాల నుంచి ఇలాంటి విజ్నప్తులే వస్తున్నాయి. దీంతో వారి  సౌకర్యార్థం నిబంధనలను సడలించే అవకాశం ఉండొచ్చన్న సూచనలను తెలియజేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alexander Kadakin  Russia Ambassador  India  Notes Ban  

Other Articles