కన్ఫర్మ్: రాజమౌళి నెక్స్ట్ అమరావతి... | Rajamouli ideas for Andhra pradesh capital Amaravati.

Rajamouli working for amaravati

Rajamouli Amaravati, SS Rajamouli Ideas Amaravati, Rajamouli Amaravati capital, Andhra Pradesh new Capital Amaravati, Rajamouli AP capital, Rajamouli Ideas for Amaravati, Baahubali director for Amaravati, Rajamouli's next Amaravati, Amaravati capital design Rajamouli, Minister Narayana Rajamouli

Director SS Rajamouli to render services for design of Iconic buildings in Amaravati.

అమరావతి కోసం జక్కన్న! నిజమేనంట...

Posted: 12/08/2016 09:25 AM IST
Rajamouli working for amaravati

రాజధాని లేకుండా ఏర్పడిన రాష్ట్రంగా నవ్యాంధ్ర కొత్త అధ్యయనం లిఖించిన విషయం తెలిసిందే. అయితే పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను కాదని, మంకు పట్టుతో కొత్త దానిని నిర్మించుకోవాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి సంకల్పంగా పెట్టుకున్నాడు. సింగపూర్ కి చెందిన నిపుణులైన ఇంజనీర్ లతో ప్లానింగ్ ఏర్పాటు చేయించుకుని, ముందు తాత్కాలిక భవనాలతో కార్యాకలపాలు సాగిస్తూ.. ఆపై శాశ్వత రాజధాని నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నాడు.

ఈ క్రమంలో ఓ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. 'బాహుబలి'తో యావత్ ప్రపంచ దృష్టిని దేశం వైపు మళ్లించిన దర్శకుడు రాజమౌళి సేవలను అమరావతి కోసం వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. భారతీయ సినీరంగంలో సంచలనం సృష్టించిన బాహుబలిలో మహిష్మతి రాజ్యాన్ని ఎవరూ మర్చిపోలేరంటే అతిశయోక్తి కాదు. అందుకే కొత్త రాజధాని ఫ్లానింగ్ కోసం జక్కన్న ను వాడుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చారు. నిజానికే గతేడాదే ఈ ప్రయత్నం జరిగినప్పటికీ, అప్పుడు రాజమౌళి తిరస్కరించడన్న ఓ వార్త చక్కర్లు కొట్టింది.

 

దేశ సంస్కృతి, చరిత్రపై మంచిపట్టున్న రాజమౌళిలాంటి వాళ్లను రాజధాని కోసం వినియోగించుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించాడంట. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ భవనాల ఆకృతుల రూపకల్పనలో రాజమౌళి సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రాంతీయ అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) అధికారులు రంగంలోకి దిగారు. బుధవారం మంత్రి పి.నారాయణ ఆధ్వర్యంలో సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ సహా ఇతర అధికారుల బృందం రాజమౌళితో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

దాదాపు గంటపాటు రాజమౌళితో సమావేశమై రాజధానిలో నిర్మించనున్న భవనాలపై చర్చించారు. శాసనసభ, హైకోర్టుల నమూనాలపై సలహాలు ఇవ్వాలని కోరటంతోపాటు, అవసరమైతే వాటి డిజైనింగ్ ల కోసం ఇంజనీరింగ్ నిపుణులకు నేతృత్వం వహించాలని కోరారంట. తెలుగు రాష్ట్రాల చరిత్ర, సంస్కృతులు, మూడు ప్రాంతాల్లోని రాజుల చరిత్రపై చర్చించి రాజధానిని వైభవంగా ఉండేలా తీర్చిదిద్దబోతున్నారని సమాచారం. నిర్మాణంలో తనవంతు సహకారం అందిస్తానని, తగిన సూచనలు, సలహాలు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు రాజమౌళి చెప్పినట్టు తెలుస్తోంది. బాహుబలి-2 పూర్తయిన వెంటనే అమరావతి కోసం దర్శకధీరుడు రంగంలోకి దిగనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh Capita  Amaravati Rajamouli  

Other Articles