చలిపులి పంజా విసురుతోంది. ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా చలి వీడటం లేదు. దీంతో తెలుగురాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోతున్నాయి, రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతూ.. అత్యంత కిందకు దిగజారుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గాయి. ఆదిలాబాద్‌లో అత్యంత తక్కువగా 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. అక్కడ పగటి ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదైంది. పగటి ఉష్ణోగ్రతకు రాత్రి ఉష్ణోగ్రతకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.
మెదక్‌లోనూ కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీలు రికార్డయింది. అక్కడ సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్, నిజామాబాద్‌ల్లో 12 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హకీంపేట, హన్మకొండ, ఖమ్మం, రామగుండంలలో 13 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆది, సోమవారాల్లోనూ రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని, దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తుపాను కారణంగా ఈనెల 13, 14 తేదీల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
అటు మన్యం జిల్లాలు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలోని మన్యం ప్రాంతాల్లో కూడా మంచు దుప్పటి కప్పుకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. దీంతో పర్యటకులతో పాటు స్ధానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. క్రితం రోజు రాత్రి లంబసింగిలో 11 డిగ్రీలు, పాడేరు, చింతపల్లిలో 13 డిగ్రీలు, మోదుకొండమ్మ పాదాల వద్ద 12 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more