మమతను చంపుతామని జైషే మహమ్మద్ లేఖ JeM 'Member' Threatens To Kill Mamata, Blow up Howrah Station

Jem member threatens to kill mamata blow up howrah station

mamata banerjee, howrah railways, West Bengal CM, Jaish-e-Mohammad, Eastern Railways, howrah, howrah railway station, west bengal

JeM members threatened to kill Mamata Banerjee and blow the Howrah Railway station by improvised explosive device (IED) if his demand for Rs 50 crore was not met.

మమతను చంపుతామని జైషే మహమ్మద్ లేఖ

Posted: 12/13/2016 11:41 AM IST
Jem member threatens to kill mamata blow up howrah station

పెద్ద నోట్ల రద్దుపై దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని హతమారుస్తామంటూ బెదిరింపు లేఖ రావడం దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలానికి గురిచేసింది. తూర్పు రైల్వే విభాగం జనరల్ మేనేజర్ కు ఈ లేఖ అందింది. రూ. 50 కోట్ల సమకూర్చితే పర్వాలేదు.. కానీ ఒక వేళ తమ డిమాండ్ ను ప్రభుత్వవర్గాలు తేలిగ్గా తీసుకున్నా.. లేక డబ్బును సమకూర్చకపోయినా.. లక్షాలాధి మంది బెంగాల్ ప్రజల ప్రాణాలతో పాటు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాణాలను కూడా తాము హరిస్తామని వారు బెదిరించారు. అనునిత్యం జనసామర్థ్యంలో కూడిన హౌరా రైల్వే స్టేషన్ ను పేల్చుతామని కూడా తీవ్రవాద సంస్థ జైషే ఈ మహ్మద్ ఆ లేఖలో హెచ్చరించారు.

గతంలో ఎయిర్ ఇండియా, దూరదర్శన్ లలో పనిచేసిన వాడిగా తననకు తాను పేర్కోన్న జైషే-ఈ-మహ్మద్ గ్రూప్ చెందిన ఓ తీవ్రవాది చేతివ్రాతతో ఈ బెదిరింపు లేఖ హెడ్క్వార్టర్స్కు వచ్చింది. ఆ లేఖలో తమ గ్రూప్ కోసం రూ.50 కోట్లను తూర్పు రైల్వే జనరల్ మేనేజర్ అందించాలని, ఒకవేళ తమ డిమాండ్ నెరవేర్చకుంటే హౌరా రైల్వేస్టేషన్ను ఐఈడీతో పేల్చి, లక్షలాది మంది ప్రయాణికులను చంపేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా మమతా బెనర్జీని కూడా తమ ఆర్గనైజేషన్ హతమారుస్తుందని బెదిరించారు.

డబ్బును సమకూర్చిన తరువాత ప్రిలబ్ నాగ్ అనే వ్యక్తికి ఫోన్ చేయాలని, లేదా తనకైనా ఫోన్ చేయాలని రెండు ఫోన్ నెంబర్లను కూడా లేఖలో పొందుపర్చాడు అగంతకుడు. ఈ బెదిరిపు లేఖను దూరదర్శన్ మాజీ ఉద్యోగి సుబాష్ చంద్ర.దాస్ రాసినట్టు లేఖలో అగంతకుడు లేఖ చివరన తన పేరును కూడా రాశాడు. తాను ఎయిర్ అండ్ టీవీ సంస్థలో పనిచేస్తున్న సమయంలో అనేక ఫ్లాట్ కు తీసుకుని వాటిలో తన ఉగ్రవాద సంస్థకు చెందిన అనేక మందికి అశ్రయిం కల్పించినట్లు తెలిపాడు. ఇక ఈ లేఖ అందగానే ఎక్స్ ట్రా స్మార్ట్ గా ఎలాంటి పనులు చేయరాదని కూడా ఉగ్రవాది లేఖలో హెచ్చరించాడు. ఈ లెటర్ ను పోలీసులకు అందించినట్టు డివిజనల్ రైల్వే మేనేజర్ బద్రినారాయణ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mamata banerjee  howrah railways  Jaish-e-Mohammad  Eastern Railways  west bengal  

Other Articles